Webdunia - Bharat's app for daily news and videos

Install App

"దంగల్" రికార్డును బ్రేక్ చేసిన బాహుబలి: విడుదలైన తొలిరోజే?

చైనాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ 'దంగల్' రికార్డును బాహుబలి-2 అధిగమించింది. బాహుబలి: ది కన్‌క్లూజన్‌ సినిమా విడుదలై ఏడాది గడిచినా.. ఆ సినిమా రికార్డుల పంట పండిస్తూనే వుంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో

Webdunia
శనివారం, 5 మే 2018 (11:56 IST)
చైనాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ 'దంగల్' రికార్డును బాహుబలి-2 అధిగమించింది. బాహుబలి: ది కన్‌క్లూజన్‌ సినిమా విడుదలై ఏడాది గడిచినా.. ఆ సినిమా రికార్డుల పంట పండిస్తూనే వుంది. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై.. బాక్సాఫీస్‌ వద్ద రూ.1,700కోట్లకు పైగా వసూలు చేసింది.
 
ప్రపంచ వ్యాప్తంగా యమా క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ చిత్రం.. జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఇటీవల చైనాలో కూడా భారతీయ చిత్రాలకు విశేష ఆదరణ లభిస్తున్న తరుణంలో ''బాహుబలి-2''ను భారీస్థాయిలో మే 4 (శుక్రవారం) విడుదల చేశారు. విడుదలైన తొలిరోజే ఈ చిత్రం రికార్డు నెలకొల్పింది. తొలిరోజే 2.85 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.19కోట్లు) వసూలు చేసింది. 
 
అంతేకాకుండా అమీర్ ఖాన్ నటించిన ''దంగల్''ను బాహుబలి-2 అధిగమించింది. దంగల్ చిత్రం 2.49మిలియన్‌ డాలర్ల ఓపెనింగ్‌ను మాత్రమే సాధించగా, బాహుబలి 2.85 మిలియన్ డాలర్లు రాబట్టింది. బాహుబలి: ది కన్‌క్లూజన్‌‌లో ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కీరవాణి సంగీతం అందించారు. తాజాగా 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ యాక్షన్‌, ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డులను గెలుచుకున్న సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments