Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ రేంజిలో ఆడితే నాలుగు రోజుల్లోనే 750 కోట్ల వసూలు ఖాయం. బాహుబలి ప్రభంజనం

శుక్రవారం విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి2 చిత్రం ఒక్క భారత దేశంలోనే తొలిరోజు 121 కోట్లు వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 217 కోట్లు వసూలు చేసి అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగిందంటే నాలుగు రోజుల వ్యవధిలో

Webdunia
ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (11:40 IST)
యుద్ధంలో సైనికులు తోటి సైనికులను ఊచకోత కోసినట్లుగా బాహుబలి-2 భారతీయ చలనచిత్ర రికార్డులను ఊచకోత కోసింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్లు ఏ భారతీయ చిత్రానికి భవిష్యత్తులోనూ సాధ్యంకానంత భారీ రికార్డులను సాధించే దిశగా పరుగు పెడుతున్నాయి. శుక్రవారం విడుదలై  ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాహుబలి2 చిత్రం ఒక్క భారత దేశంలోనే తొలిరోజు 121 కోట్లు వసూలు చేయగా ప్రపంచ వ్యాప్తంగా 217 కోట్లు వసూలు చేసి అంతర్జాతీయ చలన చిత్ర పరిశ్రమను నివ్వెరపరిచింది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగిందంటే నాలుగు రోజుల వ్యవధిలోనే బాుహుబలి 2 సినిమా 750 నుంచి 800 కోట్ల రూపాయలను వసూలు చేయడం ఖాయమంటున్నారు సినీ పండితులు ఇదే సాధ్యమైతే వారంరోజుల్లోనే వెయ్యి కోట్ల క్లబ్‌లోకి బాహుబలి-2 దూసుకెళ్లడం ఖాయం.
 
ఎలాగో చూద్దాం. శుక్రవారం విడుదలయ్యే ప్రతి సినిమా శనివారం, ఆదివారం మరింతగా వసూలు చేయడం రివాజు. ఎందుకంటే శని, ఆదివారాలు సెలవు దినాలు కాబట్టి శుక్రవారం వసూళ్లకంటే శని, ఆదివారం వసూళ్లు ఇంకా అధికంగా ఉంటాయి. పైగా మే 1 అంటే సోమవారం కూడా మేడే సందర్భంగా సెలవు కాబట్టి వరుసగా మూడు సెలవుదినాల్లో గరిష్ట సంఖ్యలో జనం సినిమా చూసే అవకాశం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే బాహుబలి టీం, నిర్మాతలు, దర్శకుడు ఊహిస్తున్న వెయ్యి కోట్ల వసూళ్లలో నాలుగింట మూడు వంతులు నాలుగురోజుల్లోనే  వచ్చే అవకాశం ఉందని ఊహించవచ్చు. 
 
ఇదే వరవడిలో బాహుబలి ది బిగినింగ్ లాగా బాహుబలి ది కంక్లూజన్ కూడా 50 రోజుల నుంచి 75  రోజుల వరకు కంటిన్యూగా ఆడిందంటే దాని వసూళ్ల రేంజిని ఊహించడం కూడా కష్టమే. దుస్సాహసం అనకపోతే బాహుబలి నిర్మాతలు రెండోభాగానికి అంచనా వేసుకున్న మొత్తం (వెయ్యి కోట్లు)  చాలా తక్కువ అనే చెప్పాలి. 
 
కలెక్షన్ల విషయంలో బాహుబలికి బాహుబలే పోటీ..
అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments