Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీకి విరాళంగా పైసా ఇవ్వం.. నిర్మాత శోభు : బాహుబలి మరో రికార్డు

భారత ఆర్మీకి బాహుబలి చిత్ర నిర్మాతలు భారీ మొత్తంలో విరాళం వార్తలు వచ్చాయి. వీటిపై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందిస్తూ... ‘బాహుబలి-2’ మొదటి రోజు కలెక్షన్లను ఆర్మీకి డొనేషన్ కింద ప్రకటిం

Webdunia
సోమవారం, 15 మే 2017 (11:14 IST)
భారత ఆర్మీకి బాహుబలి చిత్ర నిర్మాతలు భారీ మొత్తంలో విరాళం వార్తలు వచ్చాయి. వీటిపై ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ స్పందిస్తూ... ‘బాహుబలి-2’ మొదటి రోజు కలెక్షన్లను ఆర్మీకి డొనేషన్ కింద ప్రకటించామనే వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. 
 
రూ.వెయ్యి కోట్లు అంటే తెలియని నిర్మాతను తానని, ఈ విజయం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. అయితే, తమ చిత్రం విజయం సాధించడం చూసి అసూయ పడుతున్న కొందరు కావాలని చెప్పే, తాము ఆర్మీకి డబ్బు డొనేట్ చేస్తున్నామనే వదంతులు సృష్టిస్తున్నారన్నారు. ఆర్మీకి ‘బాహుబలి’ టీమ్ ఎలాంటి డొనేషన్స్ చేయడం లేదని శోభు స్పష్టం చేశారు.
 
మరోవైపు... 'బాహుబలి-2 : ద కన్ క్లూజన్' దెబ్బకి రికార్డులన్నీ తెల్లబోయాయి. ఇంతవరకు హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కిన 'దంగల్' సాధించిన వసూళ్లను 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా అధిగమించింది. 'దంగల్' హిందీలో 387.39 కోట్ల రూపాయలు వసూలు చేసి, దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులకెక్కింది. 
 
ఈ రికార్డును బాహుబలి బ్రేక్ చేసింది. ఇప్పటివరకు 392 కోట్ల రూపాయల వసూళ్లతో 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' సినిమా అధిగమించింది. దీంతో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా 'బాహుబలి-2:ద కన్ క్లూజన్' నిలిచింది. ఇప్పటికే ఇది అత్యధిక వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డులు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments