Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-2కి అమెరికా నీరాజనం: 800 థియేటర్లలో విడుదల.. ఆల్ టైమ్ రికార్డ్

బాహుబలి 2 సినిమా అమెరికాలో ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందో తెలిస్తే మన గుండె ఆగిపోతుందంటున్నారు. అమెరికాలో తెలుగు సినిమాల విడుదల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో 800 పైగా థియేటర్లలో బాహుబలి-2 విడుదల కానుంది. తమిళ, హిందీ, తెలుగు వెర్షన్లు కలిపి ఇన్ని

Webdunia
సోమవారం, 10 ఏప్రియల్ 2017 (09:17 IST)
అమెరికాలో బాహుబలి-2కి  కనీ వినీ ఎరుగని స్పందన ఉన్నట్లు అందరికీ తెలిసిందే. అయితే ప్రేక్షకులనుంచి మాత్రమే కాదు. పంపిణీ వర్గాలలో ఈ చిత్రానికి ఏర్పడ్డ క్రేజి ఆంతా ఇంతా కాదని తాజా సమాచారం. ఇంతవరకు అమెరికాలో తెలుగు సినిమా ఎక్కువగా 250 థియేటర్లలో మాత్రమే విడుదల అయినట్లు రికార్డయింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా విడుదల విషయంలో ఇదే అత్యధికమట.


కానీ బాహుబలి 2 సినిమా అమెరికాలో ఎన్ని థియేటర్లలో విడుదల అవుతోందో తెలిస్తే మన గుండె ఆగిపోతుందంటున్నారు. అమెరికాలో తెలుగు సినిమాల విడుదల చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో 800 పైగా థియేటర్లలో బాహుబలి-2 విడుదల కానుంది. తమిళ, హిందీ, తెలుగు వెర్షన్లు కలిపి ఇన్ని థియేటర్లలో విడుదల అవుతోందని సమాచారం.

ఇంత అధిక సంఖ్యలో విడుదల కావడం, ప్రీమియర్ రేట్లు 30 డాలర్లు కావడం (రెగ్యులర్ సినిమా టి్క్కెట్ 20 డాలర్లట)తో వారాంతంలోనే భారతీయ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లను బాహుబలి-2 సొంతం చేసుకోనుందని పంపిణీ వర్గాల భోగట్టా. 
 
అమెరికాలో అమీర్ ఖాన్ సినిమా దంగల్ మాత్రమే ఇంతవరకు మొత్తంమీద 12 మిలియన్ డాలర్ల వసూళ్లతో అమెరికాలో అగ్రస్థానంలో ఉంది. కానీ తొలి వారాంతంలోనే బాహుబలి-2  అంతకు మించి వసూలు చేయనుందని అంచనాలు వేస్తున్నారు. ఇక మొత్తం కలెక్షన్లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయో పాఠకులు, అభిమానులకే ఎరుక.

మరో రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న బాహుబలి2 క్రేజీ ఇప్పుడే మొదలైపోయిన నేపథ్యంలో ఈ చిత్రం గురించిన అంచనాలు కూడా రోజురోజుకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మూతపడిన బాపట్ల బీచ్‌.. కారణం ఏంటంటే?

పెరుగుతున్న టమాటా, ఉల్లి ధరలను అదుపు చేయాలి..

26 నుంచి పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష!! 11 రోజుల పాటు ద్రవ ఆహారమే...

స్పాప్‌చాట్ డౌన్‌లోడ్‌కు అంగీకరించని తండ్రి... ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న బాలిక!!

వాలంటీర్లకు షాక్ : సాక్షి పత్రిక కొనుగోలు అలవెన్స్‌ను రద్దు చేసిన ఏపీ సర్కారు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments