Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీ కుటుంబాన్ని అంతం చేస్తాం.. లవ్ జిహాద్ :: అయేషా ట‌కియా భ‌ర్త‌కు బెదిరింపులు

బాలీవుడ్ నటి అయేషా టకియా భర్తకు లవ్ జిహాద్ పేరుతో బెదిరింపులు వచ్చాయి. కుటుంబాన్ని అంతం చేస్తామంటూ ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు అయేషా టకియా భర్త ఫర్హాన్ అజ్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను ప

Webdunia
శనివారం, 29 జులై 2017 (11:51 IST)
బాలీవుడ్ నటి అయేషా టకియా భర్తకు లవ్ జిహాద్ పేరుతో బెదిరింపులు వచ్చాయి. కుటుంబాన్ని అంతం చేస్తామంటూ ఈ బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు అయేషా టకియా భర్త ఫర్హాన్ అజ్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
హిందూమ‌తానికి చెందిన యువ‌తిని పెళ్లి చేసుకుని ల‌వ్ జిహాద్‌కు పాల్ప‌డినందుకు త‌నని చంపేస్తామ‌ని బెదిరింపు ఫోన్‌కాల్స్ వ‌చ్చిన‌ట్లు ఆయన ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్ చేసిన వారు త‌మ‌ను తాము రాజ‌స్థాన్ హిందూ సేన పార్టీకి చెందిన వాళ్ల‌మ‌ని చెప్పిన‌ట్లు ఫ‌ర్హాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
త‌ర‌చుగా మ‌తాల‌కు సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే ఫ‌ర్హాన్ తండ్రి, స‌మాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ మీద కోపంతోనే ఫ‌ర్హాన్‌కు ఈ బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త‌న మామ భావ‌జాలానికి ఆయేషాగానీ, ఫ‌ర్హాన్‌గానీ ఎప్పుడూ మ‌ద్ధ‌తు ప‌ల‌క‌లేదు. అయినా వారికి బెదిరింపులు రావడంతో ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్న ఎస్ఐ (Video)

సీమ, నెల్లూరు, అనంతపై బాబు కన్ను- టీడీపీ సభ్యత్వ డ్రైవ్‌లోనూ అదే ఊపు..

క్షమించరాని తప్పు చేసావు అన్నయ్యా...? ఆత్మాభిమానం ఉండొచ్చు.. ఆత్మహత్య?

బీజేపీ పట్ల పవన్ కల్యాణ్ మెతక వైఖరి ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments