Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో ఏటీఎం : హరీష్‌ శంకర్

Webdunia
శనివారం, 14 జనవరి 2023 (13:06 IST)
Harish Shankar, VJ Sunny, Krishna, Divi, C. Chandramohan, Producer Hansita
ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ జీ5తో హ‌రీష్ శంక‌ర్‌. ఆయ‌న‌కు స‌పోర్ట్‌గా దిల్‌రాజు కూడా క‌లిసి  `ఏటీఎం` అనే వెబ్ సీరీస్‌ని రూపొందించారు. బిగ్ బాస్ విన్న‌ర్ వీజే స‌న్నీ, కృష్ణ‌, ర‌విరాజ్‌, రాయ‌ల్ శ్రీ, దివి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకు సి.చంద్ర‌మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. జనవరి 20న రాబోతోన్న ఈ `ఏటీఎం` ట్రైల‌ర్‌ను  విడుద‌ల చేశారు.
 
దర్శకుడు చంద్ర మోహన్ మాట్లాడుతూ.. 'ఈ కథను నాకు ఇచ్చి చేయమని చెప్పిన హరీష్‌ శంకర్ గారికి థాంక్స్. దిల్ రాజు గారి ప్రొడక్షన్‌లో సినిమా చేయాలని ఎంతో మంది కలలు కంటారు. నాకు ఈ ప్రాజెక్ట్‌తో అవకాశం దొరికింది. నా టీం ఎంతో సహకరించింది. మాస్ వైబ్‌ అనేది మ్యూజిక్,ఆర్ఆర్‌తో అర్థమవుతుంది. సుబ్బరాజు గారి పాత్ర, షఫీ గారి పాత్ర చాలా బాగుంటుంది. జీ5 టీంకు థాంక్స్. టీం అంతా కలిసి కష్టపడినందుకే ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా వచ్చింది. హరీష్ శంకర్ గారు మా వెనకాల ఉన్నారనే ధైర్యంతోనే ముందుకు వెళ్లామ'ని అన్నారు.
 
నిర్మాత హన్షిత మాట్లాడుతూ.. 'హరీష్‌ శంకర్ గారు మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. ఆయన ఆలోచనల్లోంచే ఈ ఏటీఎం కథ పుట్టింది. దర్శకుడు చాలా బాగా తెరకెక్కించారు. నటీనటులంతా కూడా చక్కగా నటించారు. సుబ్బరాజు, సన్నీ అద్భుతంగా నటించారు. ఈ తరం ఆడియెన్స్ కోరుకునే ప్రాజెక్టులు తెరకెక్కించాలనే డీఆర్పీ (దిల్ రాజు ప్రొడక్షన్స్)ని ప్రారంభించామ'ని అన్నారు.
 
నిర్మాత హర్షిత్ రెడ్డి మాట్లాడుతూ.. 'ఏటీఎం ప్రాజెక్ట్ హరీష్ శంకర్ అన్న వల్లే మొదలైంది. సుబ్బరాజు గారితో మాది ఎన్నో ఏళ్ల బంధం. ఈ సినిమాలో ఆయన నటించినందుకు థాంక్స్. ఏటీఎంలో నటించిన నలుగురు కుర్రాళ్లు అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్' అని అన్నారు.
 
డైరెక్టర్ హరీష్‌ శంకర్ మాట్లాడుతూ.. 'కరోనా కంటే ముందు ఈ కథను రాసుకున్నాను. కరోనాలో ఇంకా డెవలప్ చేశాను. ఓటీటీలకు రాస్తే క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది. మంచి కంటెంట్‌ను జనాల ముందుకు తీసుకు రావడానికి ఫైనాన్షియల్‌ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని తరువాత నాకు అనిపించింది. ఏటీఎం సినిమాకు ప్రశంసలు వస్తే.. అవన్నీ దర్శకుడు చంద్ర మోహన్‌కు మాత్రమే దక్కాలి. . ఇప్పుడు నా ఫస్ట్ ఓటీటీ సినిమాలోనూ సుబ్బరాజు నటించారు. షఫీ ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. దివి, అశ్విన చక్కగా నటించారు. ప్రశాంత్ ఆర్ విహారి గారు మంచి సంగీతాన్ని, ఆర్ఆర్‌ను ఇచ్చారు. జీ5 టీం మాకు ఎంతో సహకరించారు. మా కోసం ఎన్నో రూల్స్ బ్రేక్ చేశారు. వారి వల్లే ఈ ప్రాజెక్ట్ ఇంత క్వాలిటీగా వచ్చింది. రెండో సీజన్ కూడా రాబోతోంది. దుబాయ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కనుంది. ఏటీఎంలో సన్నీ, రోయల్, రవి రాజ్, కృష్ణ నలుగురు పాత్రలు కాదు.. నాలుగు పిల్లర్స్. సన్నీకి పర్పెక్ట్ మాస్ హీరో అయ్యే అవకాశం ఉంది. అందరూ అద్భుతంగా నటించారు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. జనవరి 20న జీ5లో రాబోతోంద' అని అన్నారు.

సంబంధిత వార్తలు

వామ్మో ఎండలు... అధిక ఉష్ణోగ్రత దెబ్బకు ఆగిపోయిన విమానం!!

జగన్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : బ్రాహ్మణ వేదిక నేత ఫిర్యాదు

జగన్ అభిమాన పోలీసులకు హోం మంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్!!

జగన్ జల్సా ప్యాలెస్‌లో ఏమున్నాయి.. వాటికి ఖర్చు చేసిన ధరలు ఎంతో తెలుసా?

పనికిమాలిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రానికి శాపమే : సీఎం చంద్రబాబు

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments