క్రిష్ణ ఫ్యామిలీకి చెడ్డపేరు రాకుండా వుండే సినిమాలు చేస్తున్నా : అశోక్ గల్లా

డీవీ
సోమవారం, 7 అక్టోబరు 2024 (16:56 IST)
Ashok Galla, manasa
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’దేవకి నందన వాసుదేవ’తో వస్తున్నాడు, ఇందులో సరికొత్త అవతారంలో కనిపిస్తాడు. గుణ 369తో పేరుగాంచిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
 
దర్శకుడు అర్జున్ జంధ్యాల బోయపాటి శ్రీను శిష్యుడు. ఇంతకుముందు ఈయన గుణ 369 సినిమా చేశాడు. ఇప్పుడు దేవకీ నందన వాసుదేవ చేశాడు. ఈ సినిమా గురించి చెబుతూ.. ఈ సినిమా సత్ సంకలత్పంతో శక్తి వైబ్రేట్ అ యి మనకు ఎలా హెల్ప్ చేస్తుందనే సందేశం ఇందులో చెప్పాం. టైటిల్ లో వాసుదేవ ఎందుకు పెట్టామంటే బ్యాక్ డ్రాప్ క్రిష్ణుడు కనిపిస్తాడు. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. అచ్చమైన తెలుగు టైటిల్ పెట్టేలా కథ కుదిరింది. డివైన్ ఫీల్ ఈ సినిమాలో వుంది. సినిమా ఆరంభంనుంచి ముగింపు వరకు ప్రతి పాత్రా హైలైట్ అయ్యేలా వుంటుంది. స్క్రీన్ ప్లే బాగా రాసుకున్నాను అన్నారు.
 
నాయిక మానస మాట్లాడుతూ, ఈ సినిమాలో డాన్స్ కూడా బాగా చేశాను. మిస్ ఇండియా నేపథ్యం కాబట్టి ఆ ఫార్మెట్ నుంచి బయటకు వచ్చి సినిమాలో డాన్స్ చేయడం నాకు ఛేంజ్ గా అనిపించింది. కాలేజీ నుంచి మోడలింగ్ చేశాను. మిస్ ఇండియా నుంచి సినిమా అనే మరో లోకంలోకి వచ్చాను. చిన్నతనం నుంచి క్యూరియాసిటీ వుండేది. సినిమా కోసం పలు వర్క్ షాప్స్ చేశాను. ఈ సినిమా పరంగా అర్జున్ గారే నా గురువు. పాత్రను అద్భుతంగా మలిచారు.
 
హీరో అశోక్ గల్లా మాట్లాడుతూ, నేనున్న పరిస్థితికి మంచి సినిమాలు చేయాలి. మా ఫ్యామిలీ పేరు చెడగొట్టకూడదు. కష్టపడి చేయాలి. అది సినిమాలో కనిపిస్తుంది. కథ విన్నప్పుడు బాగా నచ్చేసింది. పెద్ద స్పాన్ వున్న కమర్షియల్ సినిమా నాకు రెండో సినిమాగా రావడం చాలా హ్యాపీగా వుంది. డాన్స్ అనేది నేర్చుకుని బాగా చేశాను. ఇది విజయనగరం బ్యాక్ డ్రాప్ లో జరిగేకథ. గెటప్స్ కూడా వినూత్నంగా వేయించారు. ఇందులో నాపేరు క్రిష్ణ. అమ్మచెబితే ఏదైనా చేసే కుర్రాడు. దేవుడిపై వున్న నమ్మకంకూడా అలాంటిదే. స్వేచ్ఛ కోరుకునే కుర్రాడి కథ. మహేష్ బాబు టీజర్ చూశాక, బాగుందని కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూటీ మీద స్కూలు పిల్లలు, గుద్దేశారు, వీళ్లకి డ్రైవింగ్ లైసెన్స్ వుందా? (video)

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments