Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో అశోక్ గల్లా హీరో చిత్రం

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (17:01 IST)
Ashok Galla
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు మేనళ్లుడు, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతోన్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రాబోతోన్న ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
 
తాజాగా మేకర్లు ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ మూవీ జనవరి 26న రిలీజ్ కాబోతోంది. ఈ సంధర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అశోక్ గల్లా యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు.
 
అశోక్‌ గల్లా కు ఇది మొదటి చిత్రమే అయినా కూడా టీజర్‌తోనే ఆకట్టుకున్నాడు. అశోక్ గల్లా బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్‌కు విశేష స్పందన లభించింది. ఎంతో పవర్ ఫుల్ రోల్‌లో అశోక్‌  గల్లాను డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య మరింత పవర్ ఫుల్‌గా చూపించారు. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రలో అశోక్ గల్లా కనిపించబోతోన్నారు. శ్రీరామ్ ఆదిత్య భిన్న కథలతో భిన్న చిత్రాలను తెరకెక్కించారు. ఇక ఇప్పుడు ఈ ‘హీరో’ సినిమాను సరికొత్త కథాంశంతో ఎంటర్టైనర్‌గా మలచబోతోన్నారు.
 
రానా దగ్గుబాటి ఈ సినిమాలోని మొదటి పాట అయిన `అచ్చ తెలుగందమే` లిరికల్ వీడియోను విడుదల చేయగా..  ఆ పాట అందరినీ ఆకట్టుకుంది. సంగీత దర్శకుడు జిబ్రాన్ అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. త్వరలోనే మిగతా పాటలను  రిలీజ్ చేయనున్నారు.
 
ఈ సినిమాలో జగపతి బాబు, నరేష్, సత్య, అర్చన సౌందర్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 
సమీర్ రెడ్డి, రిచర్డ్ ప్రసాద్‌లు కెమెరామెన్‌లు వ్యవహరిస్తున్నారు. జిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. చంద్ర శేఖర్ రావిపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెడ్రూంలో నాతో కలిసి నా భర్త ఏకాంత వీడియోలు, అరెస్ట్ చేయండి అంటూ భార్య ఫిర్యాదు

విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది: యువతి, తల్లిపై కత్తితో దాడి.. ఆమె మృతి

Nagababu: శాసన మండలి సభ్యుడిగా నాగబాబు ప్రమాణ స్వీకారం

నియంత్రణ రేఖ దాటొచ్చిన పాకిస్థాన్‌ సైన్యానికి భారత్ చేతిలో చావుదెబ్బ!

కంచా అడవిని కాపాడండి-బంజరు భూముల్ని వాడుకోండి- దియా, రేణు దేశాయ్, రష్మీ గౌతమ్ విజ్ఞప్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments