షారూఖ్ ఖాన్ రయీస్ రికార్డ్.. లక్ష లైక్‌లతో ధోనీని వెనక్కి నెట్టింది.. ట్రైలర్ మీ కోసం..
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన రయీస్ సినిమా ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన 3 గంటల 35 నిమిషాల్లోనే ట్రైలర్ లక్ష లైక్‌లు కొట్టేసింది. తద్వారా లక్ష లైకులు పొందిన తొలి
బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ హీరోగా నటించిన రయీస్ సినిమా ట్రైలర్ ప్రస్తుతం రికార్డుల పంట పండిస్తోంది. విడుదలైన 3 గంటల 35 నిమిషాల్లోనే ట్రైలర్ లక్ష లైక్‌లు కొట్టేసింది. తద్వారా లక్ష లైకులు పొందిన తొలి సినిమా ట్రైలర్‌గా నిలిచింది. గతంలో సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్ర ట్రైలర్ 42 గంటల్లో, ఆమిర్ ఖాన్ 'దంగల్' ట్రైలర్ 23 గంటల్లో, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ 'ఎమ్.ఎస్. ధోని' 12 గంటల్లో లక్ష లైక్‌లు సాధించాయి.
ప్రస్తుతం 'రయీస్' ట్రైలర్.. 'ఎమ్.ఎస్: ధోని' రికార్డును బ్రేక్ చేసింది. అంతేగాకుండా.. రెండున్నర నిమిషం నిడివితో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ హ్యాష్‌ట్యాగ్(రయీస్ ట్రైలర్) రోజంతా సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
'రయీస్' ట్రైలర్‌కు విశేషమైన స్పందన రావడంపై సినీ యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. రాహుల్ ఢోలకియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది రిపబ్లిక్ డేకి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ మీ కోసం..