Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్య-గౌతమ్ కార్తీక్ పాన్ ఇండియన్ మూవీ మిస్టర్. X షూటింగ్ ప్రారంభం

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (15:53 IST)
Arya-Goutham Karthik, Manju Warrier
స్టార్ హీరోలు ఆర్య & గౌతమ్ కార్తీక్ కథానాయకులుగా మను ఆనంద్  దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియన్ మూవీ “మిస్టర్ X. స్టార్ యాక్టర్  శరత్ కుమార్, నటి మంజు వారియర్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణ్‌ కుమార్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైయింది.  ఈ షెడ్యుల్ లో హీరోలు ఆర్య & గౌతమ్ తో పాటు ప్రముఖ తారాగణంపై కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తారు. ఈ మేరకు షూటింగ్ స్టిల్స్ ని విడుదల చేశారు మేకర్స్.
 
"మిస్టర్ X” లోని  యాక్షన్ సన్నివేశాల్ని భారతదేశం, ఉగాండా, అజర్‌బైజాన్, జార్జియా దేశాల్లో చిత్రీకరిస్తారు. స్టంట్ సిల్వా యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ధిబు నినాన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా, తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.
 
రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్, ఇందులాల్ కవీద్ ఆర్ట్ డైరెక్టర్. కాస్ట్యూమ్ డిజైన్ ఉత్తరా మీనన్. ఏపీ పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్,  శ్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. మిస్టర్ X చిత్రానికి ఎ. వెంకటేష్ సహ నిర్మాత.
 
మిస్టర్ X తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
 
నటీనటులు: ఆర్య, గౌతమ్ కార్తీక్, శరత్ కుమార్, మంజు వారియర్, అనఘ, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం.. ఇవన్నీ ఫాలో ఐతే బ్యూటీ మీ సొంతం అవుతుంది..

మారిపోతున్న పిఠాపురం రూపురేఖలు.... బస్టాండుకు కొత్త హంగులు (Video)

ఊపిరితో ఉన్న 15 రోజుల నవజాత శిశువును పాతిపెట్టిన కసాయి తండ్రి.. ఎక్కడ?

లోడెడ్ గన్.. ఆడుకుంటూ వుండిన మైనర్ బాలుడు మృతి

రష్యాలో ప్రధాని మోడీ టూర్.. పాశ్చాత్య దేశాలకు అసూయ : రష్యా ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments