Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ గా అరుణ్ విజ‌య్ ఆక్రోశం

Webdunia
బుధవారం, 30 నవంబరు 2022 (18:05 IST)
Arun Vijay, Pallak Lalvani
వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో మెప్పిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజ‌య్ హీరోగా సీహెచ్‌. స‌తీష్ కుమార్ అసోసియేష‌న్‌తో శ్రీమ‌తి జ‌గ‌న్మోహిని స‌మ‌ర్ప‌ణ‌లో విఘ్నేశ్వర ఎంటర్‌ టైన్మెంట్‌,మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్స్‌పై జి.య‌న్‌.కుమార వేల‌న్ డైరెక్ష‌న్‌లో ఆర్‌.విజ‌య్ కుమార్ నిర్మాత‌గా రూపొందిన చిత్రం ‘ఆక్రోశం’.

యాక్షన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ అండ్‌ ఎమోషనల్‌ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో డిసెంబర్ 9న  భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌టానికి నిర్మాత ఆర్‌.విజ‌య్ కుమార్ స‌న్నాహాలు చేస్తున్నారు.
 
నిర్మాతలు సి.హెచ్.సతీష్ కుమార్, ఆర్.విజయ్ కుమార్ మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అరుణ్ విజ‌య్‌గారు తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితులే. ఆయ‌న హీరోగా న‌టించిన సినిమాలు కూడా ఇక్క‌డ మంచి ఆద‌ర‌ణ‌ను పొందాయి. ఇంత ముందు అరుణ్ విజయ్ హీరోగా న‌టించిన ఏనుగు సినిమాను మా బ్యాన‌ర్‌లో విడుద‌ల చేశాం. 
 
రీసెంట్‌గా త‌మిళంలో అరుణ్ విజ‌య్ మీరోగా న‌టించిన సినం సినిమా త‌మిళంలో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. దాన్ని తెలుగులో ఆక్రోశం పేరుతో డిసెంబ‌ర్ 9న రిలీజ్ చేస్తున్నాం. యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్‌, రివేంజ్ ఇలా అన్ని క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసిన చిత్ర‌మిది. త‌ప్ప‌కుండా తెలుగు ఆడియెన్స్ సినిమా ఎంజాయ్ చేస్తారు’’  అన్నారు. 
 
పల్లక్ లల్వాని హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో  కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌.  మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి తది తరులు ఇతర పాత్రల్లో నటించారు.  ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం అందించారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments