Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీసులను ఆశ్రయించిన సినీ నటి శ్రీసుధ.. చిక్కుల్లో శ్యామ్ కె నాయుడు

Webdunia
శనివారం, 23 జనవరి 2021 (08:21 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ సనిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై సినీ నటి శ్రీసుధ భీమిరెడ్డి పోలీస్ కేసు పెట్టింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్ళపాటు కాపురం చేసి మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇపుడు కేసును ఉపసంహరించుకోవాలంటూ పలువురితో కలిసి బెదిరిస్తున్నారంటూ మరోమారు పోలీసులను ఆశ్రయించింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసున్న తర్వాత ఇప్పుడు కాదంటున్నాడంటూ గతేడాది శ్రీసుధ ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడీ కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ మరోమారు ఎస్సార్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. 
 
సినీ ఆర్ట్ డైరెక్టర్ చిన్నా మాదాపూర్‌లోని తన నివాసానికి పిలించాడని, స్టిల్ ఫొటోగ్రాఫర్ సాయిరాం మాగంటితో కలిసి కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
చిన్నా తనను దూషించాడని పేర్కొన్న శ్రీసుధ.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. శ్రీసుధ ఫిర్యాదుతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌కు కేసును బదిలీ చేయనున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments