Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రింకర్ సాయి నుంచి అర్థం చేసుకోవు ఎందుకే.. లిరికల్ సాంగ్

డీవీ
గురువారం, 19 డిశెంబరు 2024 (07:58 IST)
Drinker Sai, Dharma
ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి రూపొందించిన చిత్రం "డ్రింకర్ సాయి". బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు "డ్రింకర్ సాయి" సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ 'అర్థం చేసుకోవు ఎందుకే..' లిరికల్ సాంగ్ రిలీజ్  చేశారు.
 
'అర్థం చేసుకోవు ఎందుకే..' లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే, ఎన్నెన్నో చెబుతున్నా, ఏవేవో చేస్తున్నా, అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే... నా చిన్ని లోకం నువ్వేనని, నాకున్న ప్రాణం నీదేనని, నాకన్నా ఎక్కువగా నిన్నే ప్రేమించానని, ప్రేమన్న మాటే నీతో తెలిసొచ్చిందని, అర్థం చేసుకోవు ఎందుకే అర్థం చేసుకోవు ఎందుకే' అంటూ లవ్ లోని పెయిన్ ను తెలిపేలా సాగుతుందీ పాట.
 
నటీనటులు - ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో భారీ వర్షాలు.. పాఠశాలలకు రెండు రోజుల పాటు పూర్తి సెలవులు

FASTag: ఆగస్టు 15 నుండి తిరుమలకు వెళ్లే అన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి

తెలంగాణలో ఆగస్టు 13-15 వరకు అతి భారీ వర్షాలు - HYDRAA అలెర్ట్

రూ.4600 కోట్ల వ్యయంతో ఏపీతో పాటు నాలుగు సెమీకండక్టర్ తయారీ యూనిట్లు

జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ఓవర్.. ఏం జరిగినా జగన్ బెంగళూరులోనే వుంటే ఎలా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments