Webdunia - Bharat's app for daily news and videos

Install App

నకిలీ సర్టిఫికేట్లపై సమరం సాగించే 'అర్జున్ సురవరం'

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (10:51 IST)
యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ - లావణ్య త్రిపాఠి జంటగా నటించిన తాజా చిత్రం "అర్జున్ సురవరం". ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకురానుంది. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదాపడింది. ఈ నేప‌థ్యంలో చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే చిత్రం నకిలీ సర్టిఫికెట్ల స్కామ్ ప్రధానాంశంగా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. 
 
నకిలీ సర్టిఫికెట్ల స్కామ్‌లో అర్జున్ సురవరంను ఇరుక్కోవ‌డం, జర్నలిస్టు అయిన హీరో ఆ స్కామ్‌ను బయటపెట్టి అసలు నేరస్తులను చట్టానికి పట్టించ‌డం సినిమా ప్ర‌ధానాంశంగా ఉంటుంది. తమిళ సినిమా 'కనితన్'కు రీమేక్. ప్రేమ, ఎమోషన్, యాక్షన్ వంటి అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో పుష్క‌లంగా ఉన్న‌ట్టు ట్రైలర్ చూస్తే ఇట్టే తెలుస్తోంది. 
 
పోసాని కృష్ణ మురళి, వెన్నెల కిషోర్, నాగినీడు, సత్య, కిశోర్, తరుణ్ అరోరా, ప్రగతి, విద్యుల్లేఖ రామన్, డెల్సన్ డిసౌజ, వాట్సన్ ముఖ్య పాత్రలు పోషించారు. బి. మధు సమర్పణలో ఈరోస్ ఇంటర్నేషనల్ సౌజన్యంతో ఏ మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. సామ్ సిఎస్ సంగీతం సమకూర్చారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో జీబీఎస్ మరణం : ఏపీ సర్కారు అలర్ట్

పోటు మీద పోటు పొడుస్తూ వ్యక్తిపై కత్తులతో దాడి.. (Video)

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments