Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీనియర్ నటుడు అర్జున్ దర్శకత్వంలో నాగచైతన్య

Webdunia
ఆదివారం, 1 నవంబరు 2020 (14:01 IST)
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్వకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి చైతూకి జంటగా నటిస్తోంది లవ్ స్టోరీ పేరిట ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో వచ్చే ఏడాది దీన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. 
 
మరోవైపు.. విక్రమ్ కుమార్ డైరెక్షన్ వస్తున్న థ్యాంక్యూ సినిమాలో నటించేందుకు నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఈ మూవీ అఫీషియల్‌గా లాంచ్ అయింది. త్వరలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.
 
ఇక యాక్షన్ కింగ్‌గా పేరుతెచ్చుకున్న సీనియర్ నటుడు అర్జున్ దర్శకుడిగా.. నిర్మాతగా కూడా తనదైన ముద్రవేసుకున్నారు. ఇప్పుడు తెలుగులో అక్కినేని వారసుడు నాగ చైతన్యను డైరెక్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. 
 
ఇటీవల చైతూని కలసి, ఆయన కథ చెప్పారనీ, అది చైతూకి బాగా నచ్చిందని అంటున్నారు. దాంతో ప్రాజెక్టుకి చైతు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

ప్రపంచంలోనే ప్రమాదకరమైంది కింగ్ కోబ్రా కాదు.. నత్త.. తెలుసా?

ఈ మోనాలిసాకి ఏమైంది? కన్నీటి పర్యంతమై కనిపిస్తోంది (video)

వాట్సప్ ద్వారా వడ్లు అమ్ముకుంటున్న ఆంధ్ర రైతులు, గంటల్లోనే డబ్బు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments