Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున్ రెడ్డి మానియా.. బ్లాక్ అండ్ రెడ్.. 5లక్షల మంది అలా చేశారట..?

సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి మానియా ఏమాత్రం తగ్గట్లేదు. వీహెచ్ పుణ్యంతో బాగా పబ్లిసిటీ అయిన ఈ సినిమా విడుదలకు ముందు తర్వాత బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో జరుగుతున్న నెటిజన్ల చర్చతో అర్జున్ రెడ్డి పేరిట ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టేసింది

Webdunia
మంగళవారం, 29 ఆగస్టు 2017 (17:11 IST)
సోషల్ మీడియాలో అర్జున్ రెడ్డి మానియా ఏమాత్రం తగ్గట్లేదు. వీహెచ్ పుణ్యంతో బాగా పబ్లిసిటీ అయిన ఈ సినిమా విడుదలకు ముందు తర్వాత బాగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలో జరుగుతున్న నెటిజన్ల చర్చతో అర్జున్ రెడ్డి పేరిట ట్విట్టర్ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టేసింది. ఈ నేపథ్యంలో అర్జున్ రెడ్డి తరహా పోస్టర్లను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టుకున్న నెటిజన్ల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. 
 
అంతేగాకుండా ఐదు లక్షలకు మించిన నెటిజన్లు అర్జున్ రెడ్డి ఫాంట్‌ను ఉపయోగించారు. అర్జున్ రెడ్డి పోస్టర్లో విజయ్ దేవర కొండ బ్లాక్ అండ్ వైట్‌లోనూ.. సినిమా అర్జున్ రెడ్డి అనే పేరు గల టైటిల్ ఎరుపు రంగులో ముద్రించబడి వుండగా, విజయ్ దేవర కొండ ఫేస్ బుక్ పేజీలో స్పెషల్ ఫాంట్ జనరేటర్ యాప్‌ను విడుదల చేశారు. ఈ యాప్ ద్వారా నెటిజన్లు అర్జున్ రెడ్డి స్టైల్‌లో ఫోటో బ్లాక్ అండ్ వైట్‌గా పేరు ఎరుపు రంగులో మార్చుకోవచ్చు. 
 
ఈ యాప్ విడుదలైన గంటల్లోనే నెటిజన్లు తమ ప్రొఫైల్ పిక్చర్లను అర్జున్ రెడ్డిలా మార్చుకునేందుకు వెల్లువెత్తారు. ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీల్లో అర్జున్ రెడ్డి ఫేమ్ ప్రొఫైళ్లు అధికమయ్యాయి. ఈ యాప్ ద్వారా 24 గంటల్లోనే ఐదు లక్షల మంది తమ ప్రొఫైళ్లను అర్జున్ రెడ్డి స్టైల్‌లో మార్చుకున్నారని సినీ టీమ్ వెల్లడించింది. 

సంబంధిత వార్తలు

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments