Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇన్‌స్టాలో అర్జున్ రెడ్డి కొత్త రికార్డు.. హీరోల్లో విజయ్‌ టాప్

Webdunia
బుధవారం, 6 మే 2020 (11:46 IST)
అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందుకు కారణం అతను వెబ్ సైట్లపై నోరెత్తడమే. ఫేక్ న్యూస్ పోస్టు చేసే వెబ్ సైట్లపై విజయ్ దేవరకొండ ఫైర్ వినిపిస్తోంది. కరోనా క్రైసిస్ కారణంగా మిడిల్ క్లాస్ ఫండ్‌ని స్టార్ట్ చేసిన దేవరకొండ గురించి అవాస్తవాలు రాసారన్న నేపథ్యంలో ఒక వీడియోని రిలీజ్ చేసాడు. 
 
అంతటితో ఆగకుండా కిల్ ఫేక న్యూస్, కిల్ ఫేక్ వెబ్ సైట్స్ అంటూ ట్రెండ్ చేశాడు. విజయ్‌కి మద్దతుగా తెలుగు చలన చిత్రపరిశ్రమ మొత్తం కదిలింది. సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి మెగాస్టార్ చిరంజీవి వరకు ప్రతీ ఒక్కరూ విజయ్‌కి సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
 
తాజాగా విజయ్ దేవరకొండ ఒక కొత్త రికార్డును సాధించాడు. పెళ్ళి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్, అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్‌గా ఎదిగాడు. ఈ సినిమాతో యూత్‌లో విజయ్‌కి బాగా క్రేజ్ పెరిగింది.  
 
ఆ క్రేజ్‌తోనే హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్ స్థానంలో మొదటి స్థానాన్ని సంపాదించాడు. విజయ్ సినిమాలకే కాదు విజయ్ ఆటిట్యూడ్‌కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. స్టేజి మీద అతను మాట్లాడే తీరు చాలా మందిని ఆకర్షిస్తుంది. అందువల్లేనేమో సోషల్ మీడియాలో అతనికి ఫాలోవర్లు రోజు రోజుకీ పెరుగుతున్నారు. విజయ్ దేవరకొండ ఇన్‌స్టాగ్రామ్‌లో ఏడుమిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అది కూడా ఇన్స్టా అకౌంట్ స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాల్లో కావడం విశేషం.
 
ఇన్‌స్టా ఖాతాద్వారా ఇంతమంది ఫాలోవర్లని ఆకర్షించిన విజయ్ రికార్డు సాధించాడు. దక్షిణాదిలోనే ఏ హీరోకి కూడా ఇంతమంది ఫాలోవర్లు లేరు. విజయ్ ఒక్కడే ఈ అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pulivendula ZPTC Bypoll: పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక

జార్ఖండ్ రాష్ట్ర మాజీ సీఎం శిబు సొరేన్ కన్నుమూత

ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ - ఉప్పందించిన స్థానికులు.. టెక్కీల అరెస్టు

ఏపీలో వచ్చే మూడు రోజులపాటు వర్షాలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments