Webdunia - Bharat's app for daily news and videos

Install App

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

దేవీ
శుక్రవారం, 23 మే 2025 (18:19 IST)
Arjun Ambati, Paramapada Sopanam
టాలీవుడ్ కి అర్ధనారి వంటి హిట్ సినిమాతో  హీరోగా తెరంగేట్రం చేసిన అర్జున్ అంబటి ఆ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షోతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. తాజాగా 'తెప్పసముద్రం' 'వెడ్డింగ్ డైరీస్' వంటి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అతను హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ 'పరమపద సోపానం'. అచ్ఛమైన తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఇంటరెస్టింగ్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. 
 
'ఎస్.ఎస్.మీడియా' సంస్థ పై గిడిమిట్ల శివ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుడిమెట్ల ఈశ్వర్ ఈ చిత్రానికి సహా నిర్మాతగా వ్యవరిస్తున్నారు. అలాగే ఈ సినిమాకు గతంలో పూరి జగన్నాధ్ వంటి దిగ్గజ దర్శకుడికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాగ శివ పరమపద సోపానం చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే మరియు దర్శకత్వం అందిస్తున్నారు. అన్ని  కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 11న గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లను వేగవంతం చేస్తూ ముందుగా 'చిన్ని చిన్ని తప్పులేవో' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.
 
 'ఈగల్' ఫేమ్ డేవ్ జాండ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 'చిన్ని చిన్ని తప్పులేవో' పాటకి ఆయన అందించిన ట్యూన్ ట్రెండీగా ఉంది. సింగర్స్ పృథ్వీ చంద్ర, అదితి బావరాజు ఆలపించిన విధానం.. రాంబాబు గోశాల అందించిన సాహిత్యం యువతని ఆకర్షించే విధంగా ఉందని చెప్పాలి. విడుదలైన కాసేపటికే ఈ పాటకి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కూడా ఈ పాటలనే అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు విశ్వసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments