కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

డీవీ
సోమవారం, 2 డిశెంబరు 2024 (15:54 IST)
Ariana and Viviana
హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ చిత్రం నుంచి వస్తున్న ప్రతీ అప్డేట్ ఆడియెన్స్‌లో అంచనాలు పెంచేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అత్యంత భారీ క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ అయిన ఈ ‘కన్నప్ప’ ఏప్రిల్ 25, 2025న విడుదల కానుంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన మరో అప్డేట్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు.
 
కన్నప్ప ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతీ సోమవారం ఓ అప్డేట్ ఇస్తామని మేకర్లు ఇది వరకు ప్రకటించారు. ఇందులో భాగంగా విష్ణు మంచు పిల్లలు అరియానా మంచు, వివియానా మంచు ఫస్ట్ లుక్‌లను విడుదల చేశారు. అంతే కాకుండా ఈ రోజు విష్ణు మంచు కవల కుమార్తెల పుట్టినరోజులు కావడం కూడా విశేషం.
 
ఈ పోస్టర్‌లో పిల్లలిద్దరూ గిరిజన వేషధారణలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. శ్రీ కాళహస్తి పురాణ కథ ప్రాముఖ్యతను చాటి చెప్పే పాటలో కనిపించనున్నారు. ‘పాట పాడినా, నృత్యం చేసినా, ఇది శివుని కోసం’ అని ఈ పోస్టర్‌లో చూపించారు.
 
ఈ మేరకు విష్ణు మంచు పోస్ట్ చేస్తూ.. ‘పుట్టినరోజు సందర్భంగా నా కుమార్తెల ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ క్షణంలో నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది.  నా చిన్ని తల్లులు తెరపై సృష్టించే మ్యాజిక్‌ను చూసేందుకు నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.
 
ఇది వరకు కన్నప్ప నుంచి అవ్రామ్ లుక్‌ను కూడా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్ బాబు, శరత్ కుమార్, అర్పిత్ రాంక, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, బ్రహ్మానందం, ముఖేష్ రిషి, సప్తగిరి వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేటీఆర్ పర్యటన... ఛాతినొప్పితో కెమెరామెన్ దామోదర్ మృతి.. అందరూ షాక్

సినిమా అవకాశాల పేరుతో 13 యేళ్ల బాలికపై అత్యాచారం

Jagan: మూడు రాజధానుల విషయంపై నోరెత్తని జగన్.. అదో పెద్ద స్కామ్ అంటూ..?

ఐటీ ఉద్యోగుల రద్దీకి బ్రేక్.. నగరం మధ్యలో కొత్త ఎక్స్‌ప్రెస్ వే.. ఎక్కడంటే?

కొత్త సంవత్సర వేడుకలు.. సైబరాబాద్ పోలీసుల కొత్త మార్గదర్శకాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments