Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ మాట పెడచెవిన పెడుతున్న కంటెస్టెంట్లు, వారిద్దరికీ క్లాసేనా?

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2020 (17:17 IST)
బిగ్ బాస్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తారు కింగ్ నాగార్జున. షోలో ఎవరు ఎలా ఆడుతున్నారో.. ఎవరిని ఎలిమినేట్ చేయాలో అన్నీ చెప్పేస్తారు నాగార్జున. అంతేకాదు వారి పెర్ఫాన్మెన్స్ ను అభిమానుల కన్నా ఎక్కువగా ఫాలో అవుతుంటారు బిగ్ బాస్. 
 
బిగ్ బాస్ షో అంటే అదే కదా.. కొత్తేమి ఉంది అనుకుంటున్నారా? అయితే న్యాయనిర్ణేతగా ఉన్నవారు చాలామంది స్క్రిప్టులు రాసిస్తే చదివేస్తూ ఉంటారు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన ఎపిసోడ్ అందులోను అగ్రహీరోల్లో ఒకరైన తాను జడ్జిగా వ్యవహరిస్తున్నారంటే ఖచ్చితంగా అభిమానుల్లో ఒక అంచనా ఉంటుందనేది నాగార్జున అభిప్రాయం. 
 
బిగ్ బాస్ షో 4వ ఎపిసోడ్ నుంచి నాగార్జున కొంతమంది కంటెన్టెంట్లను హెచ్చరిస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా అమ్మరాజశేఖర్, సోహైల్ ఇద్దరూ ఉన్నారు. ముక్కు అవినాష్ కామెడీనీ సుజాత పాజిటివ్‌గా తీసుకోకపోవడం... అభిజిత్, హారికలు దగ్గరవ్వడం, గంగవ్వ సైలెంట్‌గా ఉండటం, ఇదంతా బాగా గమనిస్తున్నాడు నాగార్జున.
 
కానీ సోహైల్, అమ్మ రాజశేఖర్, స్వాతి దీక్షిత్‌ల వ్యవహారం మాత్రం షోలో ప్రస్తుతం చర్చకే దారితీస్తోంది. వీరిని హెచ్చరించారు నాగార్జున. వీరితోపాటు మరికొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. అయినా సరే చేసిన తప్పే మళ్ళీ చేస్తూ బిగ్ బాస్ మాటలను పెడచెవిన పెట్టేస్తున్నారు. ఇది నాగార్జునకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇది ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా బాస్ హెచ్చరించిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారన్న ప్రచారం బాగానే సాగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments