Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా తిరుపతి పాటకు ఆద‌ర‌ణ‌

Webdunia
శుక్రవారం, 19 ఆగస్టు 2022 (15:42 IST)
Ravan Nittoor
''జనులే తరలి చేరే కిటకిటల పర్యాటకుల పట్టణం
ఎవరూ మరిచిపోని అనుభవం ఇచ్చేటి గొప్ప పట్టణం.. మా తిరుపతి''
 
ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. కాస్కేడ్ పిక్చర్స్ బ్యానర్ పై రావణ్ నిట్టూరు కధానాయకుడిగా రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి నిర్మిస్తున్న చిత్రం 'అలిపిరికి అల్లంత దూరంలో'. స్టార్ డైరెక్టర్ నందిని రెడ్డి వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆనంద్ జె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
 
ఫణి కళ్యాణ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన మా తిరుపతి పాట సెన్సేషనల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. తిరుపతి వైభవాన్ని వర్ణిస్తూ సాగిన ఈ పాట అందరి ఫేవరేట్ రింగ్ టోన్ గా మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే పాట వినిపిస్తోంది. వెటరన్ సింగర్ శంకర్ మహదేవన్, యూత్ సింగింగ్ స్టార్ రమ్య బెహార కలసి పాడిన ఈ పాట.. ఇప్పుడు అన్నీ మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ పై టాప్ ట్రెండింగ్ కొనసాగుతోంది. ఇక యూట్యూబ్ లో అయితే మిలియన్స్ వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతుంది. సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్ ఈ పాటని దివ్యంగా స్వరపరచగా.. కిట్టు విస్సాప్రగడ లిరిక్స్ ఆకట్టుకున్నాయి. 
 
ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. నూతన నటీనటులతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటివలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మా తిరుపతి పాట అందరినీ ఆకట్టుకొని సినిమాపై మరింత పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది.
 
నటీనటులు:  రావణ్ నిట్టూరు,  శ్రీ నికిత, అలంకృత షా, బొమ్మకంటి రవీందర్, అమృత వర్షిణి సోమిశెట్టి, లహరి గుడివాడ
టెక్నికల్ టీం :  దర్శకత్వం: - ఆనంద్ జె, నిర్మాతలు: రమేష్ డబ్బుగొట్టు, రెడ్డి రాజేంద్ర పి
బ్యానర్: కాస్కేడ్ పిక్చర్స్ , డీవోపీ: డిజికె సంగీతం : ఫణి కళ్యాణ్ఎ డిటర్ : సత్య గిడుతూరి 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments