Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్న‌వాడైనా తేజ నుంచి నేర్చుకోవాలిః వ‌రుణ్‌తేజ్‌

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (13:08 IST)
Varun Tej, Tej Sajaa, Jabi reddy
తేజ‌ను నేను చిన్న‌వాడిగా చూస్తున్నా. ఇప్పుడు పెద్ద‌వాడ‌య్యాడు. క‌విత‌లు, డైలాగ్‌లు కూడా రాస్తున్నాడు. చిన్న‌వాడైనా తేజ నుంచి నేను నేర్చుకోవాలి అని హీరో వ‌రుణ్‌తేజ అంటున్నాడు. ఓబేబీ ఫేమ్ తేజ స‌జ్జా న‌టించిన `జాంబిరెడ్డి` సినిమా ప్రీ రిలీజ్ మంగ‌ళ‌వారం రాత్రి హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ వేడుక‌కు వ‌రుణ్ తేజ్ హాజ‌ర‌య్యారు. తేజ‌తో స‌ర‌దాగా మాట‌లు, జోక్‌లు వేస్తూ ఫంక్ష‌న్‌లో గ‌డిపారు. అనంత‌రం వ‌రుణ్ తేజ్ మాట్లాడారు. 
 
ఇప్పుడే తేజ క‌విత‌లు, డైలాగ్‌లు కూడా రాస్తున్నాడ‌ని తెలిసింది. నేను ఇలాంటి ఫంక్ష‌న్‌లోకి రావాల‌నుకున్నా. ఇంత‌కుముందు క‌రోనావ‌ల్ల అంద‌రినీ ఇలా క‌ల‌వ‌డం మిస్ అయ్యాం. లాక్‌డౌన్ త‌ర్వాత జాంబిరెడ్డి టీజ‌ర్ విడుద‌ల చేశారు. అది అంద‌రికీ ఎక్కింది. జాంబి జోన‌ర్ అనేది హాలీవుడ్‌లో ఫేమ‌స్‌. స‌క్సెస్‌ఫుల్ జోన‌ర్‌.. హిందీలో ఒక‌టి, త‌మిళంలో ఒక‌టి చేశారు. తెలుగులో మొద‌టిదిగా చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగు. ఆ!, క‌ల్కి సినిమాలు చూశాను. ఆయ‌న‌తో సినిమాల గురించే చ‌ర్చించేవాళ్ళం. క‌మ‌ర్షియ‌ల్ కాకుండా డిఫ‌రెంట్ గా వుండాల‌ని ఇలాంటి ప్ర‌య‌త్నం చేశాడు. తేజ నాకు ఫోన్ చేశాడు. ఇలా ఫంక్ష‌న్ వుంది అని గుర్తు చేశాడు. 
 
న‌టుడిగా నాకు ఐదేళ్ళు. కానీ తేజది 25 ఏళ్ళ అనుభ‌వం. చిరంజీవిగారి ఇంటిలో బాల‌న‌టుడిగా షూటింగ్ చేసిన‌ప్పుడు చూసేవాడిని. అప్ప‌టినుంచి త‌మ్ముడిలా వుండేవాడు. ఆ త‌ర్వాత గేప్ వ‌చ్చింది. ఒక్క‌సారిగా `ఓబేబీ` అంటూ ముందుకు వ‌చ్చాడు. ఆ సినిమా ట్రైల‌ర్ చూశాక ఇంత హ్యాండ్‌స‌మ్‌గా ఎలా మారిపోయాడు అనుకున్నా. నేను సినిమాలు భిన్నంగా వుండాల‌ని చూస్తాను. కానీ తేజ ఫ‌స్ట్ టైం ఇలాంటి వైవిధ్య‌మైన సినిమా చేశాడు. అందుకు ద‌ర్శ‌కుడిని, తేజ‌ను అభినందిస్తున్నా. ఇలా ప్ర‌యోగాలు చేయ‌డం అంత ఈజీగాదు. వారికి ల‌క్క్ వుండాల‌ని కోరుకుంటున్నాను. తేజ పెద్ద హీరోగా ఎద‌గాల‌ని ఆశిస్తున్నాను అని చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments