Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్కపై మనసుపడిన చిరంజీవి.. 152వ చిత్రంలో...

మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లేడీ మెగాస్టార్ అనుష్కల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. అదీ కూడా పుష్కరకాలం (12 యేళ్ల) తర్వాత వీరిద్దరు నటించి పూర్తిస్థాయి చిత్రం రానుంది. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ చిత

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2018 (13:08 IST)
మెగాస్టార్ చిరంజీవి, టాలీవుడ్ లేడీ మెగాస్టార్ అనుష్కల కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుంది. అదీ కూడా పుష్కరకాలం (12 యేళ్ల) తర్వాత. ఈ చిత్రానికి బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ఈయన చిత్ర కథను తయారు చేసే పనిలో నిమగ్నమైవున్నారు.
 
నిజానికి తెలుగు చిత్రపరిశ్రమలో అనుష్క హీరోయిన్‌గా అరంగేట్రం చేసి 13 యేళ్లు. ఈ మధ్యకాలంలో తెలుగులోని అగ్రహీరోలందరితో నటించింది. వీరిలో బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, యువ కథానాయకులు మహేశ్‌బాబు, ప్రభాస్‌, గోపీచంద్‌ తదితరులు ఉన్నారు. కానీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలతో మాత్రం ఆమె నటించలేదు. అలాంటి అవకాశం కూడా అనుష్కకు రాలేదని చెప్పొచ్చు. 
 
అయితే, ఆ మధ్య చిరంజీవి నటించిన చిత్రం "స్టాలిన్‌"లో మాత్రం అనుష్క ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించింది. అంతేకానీ, హీరోయిన్‌గా మాత్రం ఇప్పటివరకు నటించలేదు. ఈ 'స్టాలిన్' చిత్రం విడుదలై పన్నెండేళ్లు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అనుష్కకు చిరంజీవికి జోడీగా నటించే అవకాశం వచ్చిందని ఫిల్మ్‌నగర్‌ టాక్.
 
ప్రస్తుతం చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తికాగానే, కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. అందులో ఆయనకు జోడీగా అనుష్క నటించనున్నారట.
 
ఎందుకంటే అనుష్క నటించిన 'భాగమతి' చిత్రం తర్వాత ఆమె మరో చిత్రానికి సంతకం చేయలేదు. చిరు సినిమాకి సంతకం చేస్తే... కొరటాల దర్శకత్వంలో అనుష్కకు రెండో సినిమా అవుతుంది. చిరంజీవి సరసన కథానాయికగా తొలి సినిమా అవుతుంది. ప్రభాస్ - కొరటాల కాంబినేషన్‍‌‌లో వచ్చిన 'మిర్చి'లో అనుష్క నటించిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా పీఠముడి... మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

డోనాల్డ్ ట్రంప్‌కు భారీ ఊరట.. ఏంటది..?

అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీతో సహా ఆ రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments