Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిల్డప్ ఇచ్చానంటూ ట్రోల్ చేశారు.. అందుకే మాతృభాషలో చేయలేదు...

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (18:28 IST)
ఐదేళ్ళ క్రితం వచ్చిన 'ప్రేమమ్' చిత్రం ద్వారా మలయాళ వెండితెరకు పరిచయమైన భామ అనుపమా పరమేశ్వరన్. ఆ తర్వాత ఈ కేరళ కుట్టి మాతృభాషలో ఒక్క చిత్రంలో కూడా నటించలేదు. దీనికిగల కారణాలను ఆమె వివరించింది. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా స్పందిస్తూ, నేనునటించిన తొలి చిత్రంలో నా పాత్ర చాలా చిన్నదని, కానీ ఆ విషయాన్ని నేను తెలుసుకోలేక పోయినట్టు చెప్పారు. పైగా, సినిమా ప్రమోషన్‌ కోసం నిర్వహించిన ఇంటర్వ్యూలు, కార్యక్రమాల్లో చాలా గొప్పగా చెప్పుకున్నాను. తన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. ఈ కారణంగానే మాతృభాషలో కేవలం ఒకే ఒక్క సినిమా చేసినట్టు వెల్లడించారు. 
 
'ప్రేమమ్ విడుదలైనప్పుడు నేను చాలా చిన్న పిల్లని. అప్పుడు నాకసలు ఏమీ తెలియదు. ఎవరో తెలిసున్న వాళ్లు చెబితే, ప్రమోషన్స్ సమయంలో మీడియాలో ఇంటర్వ్యూలు ఎక్కువగా ఇచ్చేశాను. దానికితోడు, చిన్నపిల్లని కదా, సమాధానాలు కూడా ఏవేవో చెప్పేశాను. తీరా చూస్తే, 'ప్రేమమ్' సినిమాలో నాది చిన్న క్యారెక్టర్. దాంతో అందరూ నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలెట్టారు. 
 
ఇంటర్వ్యూలలో చాలా బిల్డప్ ఇచ్చానంటూ ట్రోల్ చేశారు. దాంతో బాగా నిరాశకు లోనయ్యాను. అందుకే, మలయాళం సినిమాలకు దూరంగా వుండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. వచ్చిన సినిమాలను తిరస్కరించాను. ఇతర భాషలపై దృష్టి పెట్టాను.. అదే కారణం!' అంటూ తాజాగా వివరణ ఇచ్చింది. 
 
కాగా, ఈ కేరళ కుట్టి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాలు చేస్తూ మలయాళం వైపు కనీసం ఓ చూపు కూడా చూడడం లేదు. ఐదేళ్ల కాలంలో కేవలం ఒకే ఒక చిత్రంలోనే ఈ భామ నటించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంజనేయ స్వామికి ఆలయంలో వానరం.. గదపట్టుకుని దర్శనం (video)

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments