Webdunia - Bharat's app for daily news and videos

Install App

'నా పేరు సూర్య' అంటున్న బన్నీకి జోడీ కుదిరింది...

'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీజేగా ఆలరించిన అల్లు అర్జున్.. మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, లగ

Webdunia
సోమవారం, 17 జులై 2017 (11:21 IST)
'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి డీజేగా ఆలరించిన అల్లు అర్జున్.. మరో కొత్త చిత్రంలో నటించనున్నారు. మెగా బ్రదర్ నాగబాబు సమర్పణలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీధర్, లగడపాటి శిరీషా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'మజ్ను' ఫేమ్ అను ఇమ్మాన్యుయెల్‌ను ఖరారు చేశారు.
 
దీనిపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ అల్లు అర్జున్‌కు జోడీగా పలువురు క్రేజీ కథానాయికల పేర్లను పరిశీలించినప్పటికీ అను ఇమ్మాన్యుయెల్‌ను ఖరారు చేశాం. ఈ సినిమాలో యాక్షన్‌కింగ్ అర్జున్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రధాన విలన్‌గా శరత్‌కుమార్ నటిస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సాగే చిత్రమిది. 
 
ఆయన పాత్ర చిత్రణ కొత్తగా వుంటుంది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. విశాల్-శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు అని తెలిపారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజీవ్ రవి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. యోగానంద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాబు, సహనిర్మాత: బన్నీవాస్. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కృష్ణానది ఒడ్డున భారీ క్రీడా నగరం.. పెదలంక - చిన్నలంక గ్రామాల పరిసరాల్లో..?

హైదరాబాద్‌లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్‌: కాగ్నిజెంట్‌తో సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్ భాగస్వామ్యం

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments