చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సహజమే : అనూ ఇమ్మాన్యుయేల్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2023 (11:24 IST)
చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ సహజమేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందేనంటూ హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ అన్నారు. అయితే, ఇలాంటి అనుభవాలు ఎదురైనపుడు కుటుంబ సభ్యుల సహకారం, మద్దతుతో ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైతే మాత్రం కుటుంబ అండ తీసుకోవాలని సూచించారు. 
 
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది బహిరంగ రహస్యమే. తాము లైంగిక వేధింపులకు గురయ్యామంటూ ఇప్పటికే అనేక మంది నటీమణులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. తాజాగా ఈ జాబితాలో అనూ ఇమ్మాన్యుయేల్ కూడా చేరిపోయారు. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అంగీంచాల్సిందేనని చెప్పారు. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడే ధైర్యంగా ముందుకు సాగాలని, అవసరమైతే కుటుంబ సభ్యుల మద్దతు తీసుకోవాలని ఆమె హితవు పలికారు. ఒత్తిడికి గురైనపుడు కుటుంబ సభ్యులతో చెప్పి వారి అండ తీసుకోవాలని సూచించారు. 
 
26 యేళ్ల అను ఇమ్మాన్యుయేల్ గత 2011లో బాల నటిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. నేచరుల స్టార్ నాని హీరోగా నటించిన మజ్ను చిత్రంలో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్‌ను జైలులో పెట్టండని జనసేన చెప్పలేదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ భేషరతుగా వ్యాఖ్యల ఉపసంహరణ

తెలంగాణకు అరుదైన గౌరవం.. పోచంపల్లి ఇకాట్‌ను ధరించి కేన్స్‌లో మెరిసిన రష్మీ

ఏపీ రాష్ట్రంలో సీ ప్లేన్ ప్రాజెక్టు ప్రారంభానికి కీలక ప్రోత్సాహం.. రూ.200 కోట్లు కేటాయింపు

కడపలో ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ కొత్త శాఖ: రూ. 50 లక్షల వరకు స్పాట్‌లో మంజూరు

నిప్పుల కుంపటిగా తెలుగు రాష్ట్రాలు - పిడుగురాళ్లలో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

పార్కిన్సన్స్ నియంత్రణలో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ కీలక చికిత్స: మెడికవర్ వైద్యులు

డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ నుంచి నోటి ద్వారా తీసుకునే సెమాగ్లుటైడ్ బయోసిమిలర్ ఒబెడా టాబ్లెట్లు

ప్రీ-డయాబెటిస్ బాధితులకు బాదంతో ఎంతో మేలు, ఎలాగంటే?

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ... బైటకు రావద్దండీ...

తర్వాతి కథనం