Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్' నుంచి "అంత ఇష్టం ఏంద‌య్యా" సాంగ్ రిలీజ్

Webdunia
శుక్రవారం, 15 అక్టోబరు 2021 (12:16 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ హీరో రానా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సాగ‌ర్ కె చంద్ర తెర‌కెక్కిస్తున్న చిత్రం భీమ్లా నాయ‌క్. మళయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్‌’ తెలుగు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్’ సినిమా రూపొందిస్తున్నారు. 
 
ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లేతో పాటు.. మాటలు సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్‌’ అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.
 
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుద‌లైన ఫస్ట్‌లుక్, ప్రచార చిత్రాలు, ఫస్ట్‌ సింగిల్‌ ప్రేక్ష‌కులను బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్‌కు జోడిగా నిత్యామీనన్‌ నటిస్తున్నారు. వారిద్ద‌రికి సంబంధించిన "అంత ఇష్టం ఏంద‌య్యా" అంటూ ప్రోమోను అక్టోబ‌రు 14న విడుద‌ల చేశారు. 
 
విజయదశమి పండుగ సందర్భంగా ఫుల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇది శ్రోత‌ల‌కు విన సొంపుగా వుండటంతో ఎంతో ఆక‌ట్టుకుంటుంది. ‘అంత ఇష్టం ఏందయ్యా..’ అంటూ సాగే పాటను ప్రముఖ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రీ రాయగా.. సీనియర్ గాయకురాలు చిత్ర ఆలపించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి సురక్షితంగా చేరుకున్న నేపాల్‌లో చిక్కుకున్న 150మంది తెలుగువారు

2027 గోదావరి పుష్కరాల కోసం ఏర్పాట్లు చేపట్టాలి.. రేవంత్ రెడ్డి ఆదేశాలు

నేపాల్‌లో ఘర్షణలు - హోటల్‌కు నిప్పు - భారత మహిళ మృతి

బంగాళాఖాతంలో అల్పపీడనం : ఏపీకి భారీ వర్ష సూచన

మేమంతా భారత రాష్ట్ర సమితిలోనే కొనసాగుతున్నాం.. ఫిరాయింపు ఎమ్మెల్యేల వివరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments