Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

డీవీ
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (11:32 IST)
Akhil akkineni
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ కథానాయకుడిగా సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూ మాస్ హీరోగా ఎదగాలని ఏజెంట్ చేశాడు. వయస్సుకు మించిన పాత్ర వేయడంతో కథలోపంతో కూడా ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. అభిమానులు కూడా కథపై శ్రద్శ పెట్టమని నాగార్జునకు కూడా పలుసందర్భాలలో చెప్పడం కూడా జరిగింది. అందుకే కొంత కాలం గేప్ తీసుకున్న అఖిల్ తాజాగా కొత్త సినిమా చేయడానికి శ్రీకారం చుట్టారు. ఆ సినిమా పట్టాలెక్కింది. ఆర్భాటం లేకుండా సాదాసీదాగా షూటింగ్ ను ఆరంభించారు. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
 
నూతన నటి నాయికగా తెలుగుకు పరిచయం కాబోతోంది. ఈ చిత్రానికి వినరో భాగ్యము విష్ణుకథ సినిమాకు పనిచేసిన నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్ పై రూపొందుతున్న సినిమాకు సుప్రియ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అఖిల్ కు తగిన కథను సెట్ చేసుకున్న దర్శకుడు నాగార్జున ఓకే అన్న తర్వాత సెట్ పైకి తీసుకెళ్ళినట్లు తెలుస్తోంది. అఖిల్ కూడా కథపై పూర్తి నమ్మకంతో వున్నాడు. గత సినిమాకు భిన్నంగా ఈ సినిమా వుంటుందనీ తగు పాళ్ళలో సెంటిమెంట్ వుంటుందని తెలుస్తుంది. పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విత్తమంత్రి నిర్మలమ్మ ధరించిన చీర ప్రత్యేక ఏంటో తెలుసా?

ప్రియురాలి జల్సాల కోసం చైన్ స్నాచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు..

చరిత్రలో తొలిసారి.. పూనమ్ గుప్తా వివాహానికి వేదిక కానున్న రాష్ట్రపతి భవన్

మరికొన్ని నిమిషాల్లో దేశ బడ్జెట్... తెలుగు రాష్ట్రాల్లో భారీ అంచనాలు...

కేవలం 11 సీట్లా..? ఇంత ఘోరంగా ఓడిపోతామని కలలో కూడా ఊహించలేదు : అంబటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం
Show comments