Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీరియాడిక్ లవ్ స్టోరీ గా అన్నపూర్ణ ఫోటో స్టూడియో

Webdunia
సోమవారం, 19 జూన్ 2023 (16:13 IST)
Chaitanya Rao, Lavanya
టైటిల్, కాన్సెప్ట్ తో పాటు లిరికల్ పాటలతో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచిన "అన్నపూర్ణ ఫోటో స్టూడియో" సినిమా జూలై 21న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్రబృందం ప్రకటించింది. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. 
 
ఈ సినిమా విడుదల తేదీ ఖరారైన సందర్భంగా నిర్మాత యష్ రంగినేని మాట్లాడుతూ...గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. పీరియాడిక్ సినిమాగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు చెందు ముద్దు ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారు. 80 దశకం నేపథ్యంతో సినిమా సాగుతుంది. మా సంస్థకు మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, లిరికల్ సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. జూలై 21న మా సినిమాను విడుదల చేస్తాం. అన్నారు
 
చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

ప్రేమబంధానికి బీమా సౌకర్యం.. 'జికీలవ్' పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ!!

మెహుల్ చోక్సీ అప్పగింతకు న్యాయపరమైన చిక్కులు!

పెళ్లి కాలేదని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments