Webdunia - Bharat's app for daily news and videos

Install App

'అన్నాత్తే' నుంచి తొలి పాట.. అదే ఎస్పీబీ చివరి పాట.. సూపర్ స్టార్ భావోద్వేగం

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (12:38 IST)
తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ స్పీడు పెంచారు. దీపావళి కానుకగా శివ దర్శకత్వంలో వస్తున్న'అన్నాత్తే' మూవీని ప్రేక్షకుల ముందు తీసుకరావాలని రంగం సిద్దం చేస్తున్నారు. నవంబర్ 4న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నారు. ప్రమోషన్‌లో భాగంగా ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే.. ఈ సినిమాకి డి. ఇమ్మన్ సంగీతం సమకూర్చారు.
 
అన్నాత్తే.. అన్నాత్తే అంటూ సాగే పాటను దివంగత గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం పాడారు. సాధారణంగా రజినీకాంత్ సినిమాల్లో తొలి పాటను బాలు పాడుతుంటారు. తన సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ 'అన్నాత్తే' సినిమా కోసం బాలుతో పాట పాడించారు. ఈ పాటను వివేక్ రాసారు. ఈ టైటిల్ సాంగ్ లో రజినీ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ, హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలియజేసేలా రూపొందించారు.
 
సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ ఈ సినిమాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ పాట గురించి రజినీకాంత్ ఓ స్పెషల్ ట్వీట్ చేశారు. ''ఎస్పీబీగారు నలభైఅయిదేళ్లు నా గాత్రంలా జీవించారు. నా 'అన్నాత్తే'లో ఆయన పాడిన ఈ పాటే చివరి పాట అవుతుందని కలలో కూడా అనుకోలేదు. నేనెంతగానో అభిమానించే ఎస్పీబీ తన మధురమైన స్వరం ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటారు” అని రజనీకాంత్‌ తమిళంలో ట్వీట్‌ చేశారు. సూపర్‌స్టార్ రజినీ, ఎస్పీబీతో తనకున్న అనుబంధం గురించి తెలుపుతూ.. ఎమోషనల్ అయ్యారు.
 
ఇదిలాఉంటే.. ఇటీవల 'అన్నాత్తే' సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఇందులో రజినీ లూక్ అదుర్స్‌. ఈ చిత్రంలో రజినీ సరసన ఖుష్బూ, మీనా, నయనతారలు నటిస్తున్నారు. రజినీకాంత్ కుమార్తెగా కీర్తి సురేశ్ నటించనున్నది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, అభిమన్యుసింగ్, సూరి తదితరులు కూడా ఉన్నారు. పాట విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రం సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిఉండే కానీ, పలు కారణాలతో రిలీజ్‌కు లేట్ అయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సైబరాబాద్ పోలీసులు సీరియస్.. శబ్ధ కాలుష్యం.. 17 పబ్‌లకు లైసెన్స్ లేదు..

శ్రీవారి మెట్టుకు వెళ్లే కంట్రోల్ రూమ్‌ వద్ద చిరుతపులి - అధికారులు అప్రమత్తం

విమానంలో ప్రయాణీకురాలు.. ఆమ్లెట్‌లో బొద్దింక.. పిల్లాడు సగం తిన్నాక?

ఇంట్లో కూర్చుని బైబిల్ చదవడం ఎందుకు, చర్చికి వెళ్లి చదవండి జగన్: చంద్రబాబు

అల్లూరి జిల్లా లోని ప్రమాదకర వాగు నీటిలో బాలింత స్త్రీ కష్టాలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

ఈ 6 తిని చూడండి, అనారోగ్యం ఆమడ దూరం పారిపోతుంది

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments