Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు హీరోయిన్లతో ''అంజన'' రామకృష్ణ కొత్త చిత్రం ప్రారంభం

Webdunia
మంగళవారం, 3 మే 2016 (13:08 IST)
యామిని, భావన, రుహిణి, వర్ష హీరోయిన్లుగా శ్రీ సాయి గణపతి క్రియేషన్స్‌ పతాకంపై 'అంజన' రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. చిత్ర పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కొండా విజయ్‌కుమార్‌ క్లాప్‌ కొట్టగా, దర్శకులు సుకుమార్‌ సోదరుడు విజయ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత వై. కోటిబాబు, నిర్మాత శివ(అపురూప్‌), ఆర్టిస్ట్‌ భద్రం, జబర్ధస్త్‌ అప్పారావులతో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కె.యం. రాధాకృష్ణ సంగీతాన్ని అందిస్తున్నారు. 
 
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అంజన రామకృష్ణ మాట్లాడుతూ..'ఇదొక డిఫరెంట్‌ జోనర్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నలుగురు హీరోయిన్లకు జోడీగా ఓ ప్రముఖ హీరో ఈ చిత్రంలో నటించనున్నారు. కె.యం. రాధాకృష్ణ అందించే సంగీతం ప్రధాన ఆకర్ణణగా ఈ చిత్రం తెరకెక్కనుంది. మే ద్వితీయార్ధం నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది...'' అన్నారు. 
 
యామిని, భావన, రుహిణి, వర్ష హీరోయిన్లుగా నటించే ఈ చిత్రంలో గొల్లపూడి మారుతీరావు, రావు రమేష్‌, ప్రవీణ్‌, ధనరాజ్‌, నరసింహ, జెవిఆర్‌, దిలీప్‌ రాథోడ్‌(తొలి పరిచయం) లు ఇతర తారాగణం. ఈ చిత్రానికి మాటలు: చింతా శ్రీనివాస్‌, పాటలు: భాస్కరభట్ల, గురుచరణ్‌, శ్రీనివాస్‌, కొరియోగ్రఫీ: శేఖర్‌, బృంద, కెమెరా: నాగార్జున, సంగీతం: కె.యం. రాధాకృష్ణ, ఎడిటింగ్‌: గౌతంరాజు, నిర్మాతలు: భీశెట్టి గణేష్‌, టి. ఉమామహేశ్వరి, మానేపల్లి బాబురావు, ముత్తురాజ్‌ స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అంజన రామకృష్ణ.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hot Weather Alert: తెలుగు రాష్ట్రాలకు ముప్పు.. ఎండలు దంచినా.. ఏపీకి మేఘాలు

పెన్షన్ పంపిణీ మొబైల్ అప్లికేషన్ ఇక ఉదయం 7 గంటల నుంచి పనిచేస్తుంది..

వంశీకి ఫిట్స్ - ఆస్తమా సమస్యలున్నాయ్... పనిష్మెంట్ సెల్‌లో ఉంచారు : పంకజశ్రీ

Botsa Satyanarayana: పయ్యావుల పద్దు పనికిరాదు.. బొత్స సత్యనారాయణ

గోవా బీచ్‌లో ఇడ్లీ, సాంబార్ అమ్మితే పర్యాటకులు ఎలా వస్తారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments