Webdunia - Bharat's app for daily news and videos

Install App

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అంజలి బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్.. పార్టీలో ఎంజాయ్ చేసి?

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి బాయ్ ఫ్రెండ్, జర్నీ స్టార్ జైని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేశారు. కొత్త సినిమా పార్టీలో పండగ చేసుకుని, కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు.

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (15:15 IST)
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ అంజలి బాయ్ ఫ్రెండ్, జర్నీ స్టార్ జైని పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో అరెస్టు చేశారు. కొత్త సినిమా పార్టీలో పండగ చేసుకుని, కారు నడుపుతూ డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆపై బెయిల్‌పై విడుదల చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ సినిమాల్లో బిజీ అయిన తెలుగమ్మాయి అంజలి జైతో ప్రేమలో వున్నట్లు సమాచారం. త్వరలోనే వీరిద్దరూ వివాహం కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
అయితే జై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు. చెన్నైలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కొత్త సినిమా ఫంక్షన్లో పార్టీ చేసుకున్న జై.. ఇంద్రానగర్లోని తన ఇంటికి వెళ్లేందుకు స్వయంగా కారును నడుపుకుంటూ వెళ్లాడు. కానీ అడయార్ ఫ్లై ఓవర్ వద్ద మద్యం మత్తులో డివైడర్‌ను ఢీకొట్టాడు.
 
ఈ ఘటనలో జై కారు డ్యామేజ్ అయ్యింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు జైని అరెస్ట్ చేసి ఆపై బెయిల్‌పై రిలీజ్ చేశారు. కాగా జై, అంజలి కలిసి బెలూన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జై బుక్కవడం ఇది రెండోసారి. 2014లో ఇదే డ్రంక్ డ్రైవ్ కేసులో పట్టుబడిన జైకి పోలీసులు లైసెన్స్ రద్దు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ది గోల్కొండ బ్లూ- అరుదైన నీలి వజ్రం- మే 14న జెనీవాలో వేలానికి సిద్ధం (video)

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని పరిస్థితి విషమం

తిరుగుబాటు చట్టాలను అమలు చేయనున్న డోనాల్డ్ ట్రంప్ - 20న ఆదేశాలు జారీ!

అయ్యప్ప భక్తులకు శుభవార్త - ఇకపై బంగారు లాకెట్ల విక్రయం

వీరాభిమానికి స్వయంగా పాదరక్షలు తొడిగిన నరేంద్ర మోడీ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments