Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను సెల్ ఫోన్ సిగ్నల్స్ లేని చోటుకు తీసుకెళ్లారు... హీరోయిన్ అనీషా అంబ్రోస్

సీనియర్‌ దర్శకుడు వంశీ అప్పట్లో రూపొందించిన 'లేడీస్‌ టైలర్‌'కు సీక్వెల్‌గా 'ఫ్యాషన్‌ డిజైనర్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' అనేది ఉపశీర్షిక. సుమంత్‌ అశ్విన్‌, అనిషా అంబ్రోస్‌, మనాలి, మానస ప్రధాన పాత్రల్లో మధుర మూవీస్‌ పతాకం

Webdunia
శనివారం, 20 మే 2017 (18:12 IST)
సీనియర్‌ దర్శకుడు వంశీ అప్పట్లో రూపొందించిన 'లేడీస్‌ టైలర్‌'కు సీక్వెల్‌గా 'ఫ్యాషన్‌ డిజైనర్‌' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. 'సన్నాఫ్‌ లేడీస్‌ టైలర్‌' అనేది ఉపశీర్షిక. సుమంత్‌ అశ్విన్‌, అనిషా అంబ్రోస్‌, మనాలి, మానస ప్రధాన పాత్రల్లో మధుర మూవీస్‌ పతాకం మధుర శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అయిన సందర్భంగా హీరోయిన్‌ అనిషా అంబ్రోస్‌ చెప్పిన విశేషాలు.
 
పెద్ద వంశీ దర్శత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర అమెరికా నుండి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను, ఈ అమ్మాయికి పల్లెటూరి వాళ్లు ఎలా ఉంటారో తెలియదు. తనకు చీర కట్టుకోవడం కూడా రాదు. ఈ సినిమాలో గ్లామరస్‌ రోల్స్‌ చేయడం నాకు ఇష్టమే కానీ మాములుగా కాలేజ్‌కి వెళ్లే అమ్మాయిగా మోడరన్‌ డ్రెస్‌  కనిపించడం కామన్‌, అయితే ఈ సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపించడం మాములు విషయం కాదు. 
 
ఈ సినిమా కోసం పాపికొండలు లొకేషన్‌ వెళ్ళాం. అక్కడ సెల్‌ ఫోన్‌ సిగ్నల్‌ కూడా లేకుండా షూటింగ్‌ చేశాం. ఇక ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్స్‌ ఉంటారు. ఎంతమంది హీరోయిన్స్‌ ఉన్నా కూడా నా పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందన్నది చూస్తాను. ఇక ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం.. పెద్ద వంశీ గారు. అయన సినిమాలో అవకాశం రావడం లక్కీగా ఫీల్‌ అవుతున్నాను.
 
నిర్మాత శ్రీధర్‌ కూడా ప్రతి విషయంలో ఎంతో సపోర్ట్‌ అందించారు. ఆయనతో ఎన్ని సినిమాలైనా చేయడనికి రెడీ. నాకు హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకునేందుకు ప్లాన్‌ చేస్తున్నాను. వచ్చిన వాటిలో బెస్ట్‌ అవకాశాలను ఎంచుకుంటూ సినిమాలను ఒప్పుకుంటున్నాను. అన్ని రకాల పాత్రలు చేస్తా. అప్పట్లో పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో ఛాన్స్‌ వచ్చింది కానీ, ఈ లోగా ఆ అవకాశం నాకన్నా బెటర్‌ అని కాజల్‌కు వెళ్ళింది. ఇందులో నేను పెద్దగా ఫీల్‌ అయ్యింది ఏమి లేదు. 
 
ఆ పాత్రకు ఎవరు బెటర్‌ అని అనిపిస్తే వారికే అవకాశం వస్తుంది. నేను ప్రస్తుతం మంచు మనోజ్‌ నటిస్తున్న 'ఒక్కడు మిగిలాడు' సినిమాలో నటిస్తున్నాను. ఈ సినిమాతో పాటు మరో సినిమా చర్చల్లో ఉంది. ఏది ఏమైనా నాకు స్క్రిప్ట్‌ బాగా నచ్చాలి. అది నచ్చితేనే ఆ సినిమాకు ఓకే చెబుతా' అని తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అరరె.. బులుగు చొక్కాగాడు మామూలోడు కాదు.. ఆమె నడుము పట్టుకున్నాడే! (video)

జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన పవన్ కల్యాణ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో

మంచు ఫ్యామిలీ రచ్చ-మళ్లీ పోలీసులను ఆశ్రయించిన మంచు మనోజ్.. ఎందుకు?

ఏలూరు, కడప జిల్లాల్లో పర్యటించనున్న నారా చంద్రబాబు నాయుడు

రఘు రామ కృష్ణ రాజు కేసు.. డాక్టర్ ప్రభావతి చెప్పిన సమాధానాలకు లింకుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments