Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ram: ఆంధ్ర కింగ్ తాలూకా- టైటిల్ గ్లింప్స్ లో రామ్ పోతినేని అదుర్స్

దేవీ
గురువారం, 15 మే 2025 (13:25 IST)
Ram Pothineni, Andhra King Taluka
రామ్ పోతినేని మూవీ #RAPO22తో అలరించబోతున్నారు.  మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.
 
రామ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను అద్భుతమైన గ్లింప్స్ ద్వారా రిలీజ్ చేశారు. 2000లో ప్రారంభంలో సెట్ అయిన ఈ క్లిప్ హౌస్ ఫుల్ థియేటర్ వెలుపల అభిమానుల సందడితో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో థియేటర్ యజమాని, ఆంధ్రా కింగ్ సూర్య కుమార్ లేటెస్ట్ సినిమాకు టికెట్ల కోసం వచ్చే కాల్స్‌తో బిజీగా ఉంటాడు. మొదటిగా అతను VIP రిఫరెన్స్ ఉన్నవారికి టికెట్లు కేటాయిస్తాడు. కానీ తర్వాత విసిగిపోయి ఫోన్‌ను పక్కన పెడతాడు.
 
అప్పుడే, రామ్ సూర్య కుమార్‌కు స్పెషల్ స్టయిల్ ని అనుసరిస్తూ, బైసికల్‌పై స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. “ఆంధ్రా కింగ్ ఫ్యాన్స్ ' అంటూ ధైర్యంగా 50 టికెట్లు అడుగుతాడు. అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి థియేటర్ యజమాని మాటలేకుండా టికెట్లు ఇస్తాడు. రామ్, ఫ్యాన్స్‌తో కలిసి సంబరంగా వేడుక చేసుకుంటాడు, తన అభిమాన హీరో భారీ కటౌట్ ముందు హీరోయిక్ పోజ్ ఇస్తాడు, పేలుతున్న పటాకులతో "ఆంధ్రా కింగ్ తాలూకా" టైటిల్ రివిల్ కావడం అదిరిపోయింది.  
 
స్టార్ హీరో అయినప్పటికీ రామ్ ఈ ప్రత్యేక పాత్రలో ఒక గొప్ప అభిమాని పాత్రను పోషించడం విశేషం. అభిమాని పాత్రలో అతని స్టైల్, ఎమోషన్ గొప్పగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అతను సైకిల్‌ను స్టైలిష్‌గా పార్క్ చేసే దృశ్యం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాత్ర కోసం రామ్‌కు స్పెషల్ గా మేకోవర్‌ కూడా అయ్యారు. కథలో సూపర్‌స్టార్ కేవలం కటౌట్‌ రూపంలోనే కనిపించడమే కాక, ఉపేంద్రను స్క్రీన్‌పై ఐకాన్‌గా పరిచయం చేశారు.
 
మహేష్ బాబు పి తన స్పెషల్ హ్యుమర్ తో పాటు హృదయాన్ని హత్తుకునే కథనాన్ని అందించారు. ఫస్ట్ డే ఫస్ట్ షోలో అభిమానులకు ఇచ్చే ప్రాధాన్యతను చూపించడంలో రైటింగ్ అదిరిపోయింది. ఇది ఓ నాస్టాల్జిక్ ఎక్స్ పీరియన్స్, అభిమానుల మనసును తాకే ఎమోషన్ తో నిండిన జర్నీగా నిలుస్తుంది.
 
సిద్దార్థ నూని తీసిన విజువల్స్‌ ప్రతి సన్నివేశానికి జీవం పోస్తాయి. వివేక్–మెర్విన్ అందించిన సంగీతం ఈ అనుభవాన్ని మరింత ఎక్సయిటింగ్ గా మార్చుతుంది. జాతీయ అవార్డు విజేత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ లో తన నైపుణ్యాన్ని మరోసారి చూపించారు. అవినాష్ కొళ్ల అందించిన ప్రొడక్షన్ డిజైన్ సినిమాకి సహజత్వాన్ని తీసుకొచ్చింది. 
 
మొత్తానికి, టైటిల్ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇది అభిమానుల మనసుని తాకేలా ఉండి, భావోద్వేగంతో పాటు పవర్‌ఫుల్ ఎక్స్ పీరియన్స్ అందించే చిత్రంగా ఉండబోతోంది. ఇది ప్రతి స్టార్ అభిమానికి తప్పకుండా డిలైట్ ఫుల్ ఎక్సపీరియన్స్ ని అందించబోతోంది.
 
తారాగణం: రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తదితరులు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Vallabhaneni Vamsi: జైలు నుంచి ఆసుపత్రికి వల్లభనేని వంశీ.. శ్వాస తీసుకోవడంలో..

శశిథరూర్ నియంత్రణ రేఖను దాటారు : కాంగ్రెస్ నేతలు

రూ.100 కోట్లు నష్టపరిహారం చెల్లించండి... : కోలీవుడ్ హీరోకు తితిదే మెంబర్ నోటీసు!!

Chandrababu Naidu: అల్పాహారంలో ఆమ్లెట్ తప్పకుండా తీసుకుంటాను.. చంద్రబాబు

పురుషులపై అయిష్టత - పైగా నమ్మకం లేదంటూ పెళ్లి చేసుకున్న ఇద్దరు యువతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments