Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్యాష్ సెట్‌లో సుమకు ప్రమాదం... పెద్ద దెబ్బే...

ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్ టీవీ షోలలో క్యాష్ కార్యక్రమం ఒకటి. దీనికి ప్రజాదరణ మరియు రేటింగ్స్ కూడా ఎక్కువే. ప్రతివారం నలుగురు సెలబ్రిటీలలో సుమ చేసే సందడితో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ ప్రోగ్రామ్‌కే కాదు

Webdunia
శుక్రవారం, 8 జూన్ 2018 (15:08 IST)
ఈటీవీలో ప్రసారమవుతున్న పాపులర్ టీవీ షోలలో క్యాష్ కార్యక్రమం ఒకటి. దీనికి ప్రజాదరణ మరియు రేటింగ్స్ కూడా ఎక్కువే. ప్రతివారం నలుగురు సెలబ్రిటీలలో సుమ చేసే సందడితో ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ ప్రోగ్రామ్‌కే కాదు దీని ప్రోమోకు కూడా యూ ట్యూబ్‌లో గణనీయ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. 
 
అలా ప్రసారమైన ఈ వారం ఎపిసోడ్ ప్రోమోలో సుమ, రాజ్ తరుణ్, రాజా రవీంద్ర తదితరులతో సందడి చేస్తూ ఒక సందర్భంలో పడవపై నించుని డ్యాన్స్ చేస్తుండగా కింద పడిపోయింది. వెంటనే అక్కడ పనిచేసేవారు పరుగెత్తుకుంటూ వస్తున్నట్లుగా ప్రోమోలో చూపించారు. కార్యక్రమానికి వచ్చిన సెలబ్రిటీలు, ప్రేక్షకులు షాక్‌కు గురయ్యారు. 
 
ఈ వీడియోలో చూపిస్తున్న ప్రకారమైతే సుమకు పెద్దగా ప్రమాదం లేకపోవచ్చనే చెప్పాలి, రేపు ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ షో నిర్వాహకులు టిఆర్‌పి కోసం ప్రోమోలో ఈ యాక్సిడెంట్‌ను చూపించి ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించారు. దీనివలన ఈ ఎపిసోడ్ టిఆర్‌పి అమాంతం పెరిగే అవకాశముంది. ఎందుకంటే సుమ పాపులారిటీ అలాంటిది మరి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments