Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడీ యాంకర్లు హీరోయిన్లయితే పురుష యాంకర్లు హీరోలు కాలేరా...? అయ్యాడండోయ్...

స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి అలియాస్ యాంకర్ రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. మత్స్య క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి అయోధ్య కా

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (17:02 IST)
స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని స్టైలిష్ లుక్స్, మేనరిజమ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను గత కొంతకాలంగా విశేషంగా అలరిస్తున్న రవి అలియాస్ యాంకర్ రవి అతి త్వరలో వెండితెరపై కథానాయకుడిగా పరిచయం కానున్నాడు. మత్స్య క్రియేషన్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఓ ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ద్వారా యాంకర్ రవి హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. 
 
"ఇది మా ప్రేమ కథ" అనే టైటిల్ నిర్ణయించబడిన ఈ చిత్రానికి "1>99" (1 ఈజ్ గ్రేటర్ దేన్ 99) అనేది ట్యాగ్ లైన్. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. రవి సరసన ఇద్దరు అందాల భామలు నటించిన ఈ చిత్రాన్ని వేసవి కానుకగా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
ఈ చిత్రంలోని రవి ఫస్ట్ లుక్‌ను ఓ ప్రముఖ సెలబ్రిటీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: ఓంకార్ కడియం, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సహనిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్, దర్శకత్వం: అయోధ్య కార్తీక్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments