Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంగాంగ ప్రదర్శన నచ్చకపోతే చూడకండి : రష్మీ గౌతమ్

Webdunia
బుధవారం, 18 మార్చి 2020 (11:52 IST)
చిట్టిపొట్టి దుస్తుల్లో తాము చేసే అంగాంగ ప్రదర్శన చూడలేకపోతే కళ్లుమూసుకోవాలని తనను విమర్శించిన నెటిజన్‌కు బుల్లితెర హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ గట్టిగా కౌంటరిచ్చింది. బుల్లితెరపై రాణిస్తున్న యాంకర్లలో రష్మీకి ప్రత్యేక గుర్తింపు, పేరు ఉంది. ముఖ్యంగా అందాలను ఆరబోయడంలోనూ, మేల్ యాంకర్‌తో కలిసి బుల్లితెరపై రొమాన్స్ పండించడంలో ఆమెకు ఆమెనే సాటి. ఆమెతో ఇతర యాంకర్లు ఎవరూ పోటీపడలేరని చెప్పొచ్చు. అలాగే సోషల్ మీడియా వేదికకా తనను విమర్శించే నెటిజన్లకు కూడా ఆమె గట్టిగా వార్నింగ్ ఇవ్వడంలో ఆరితేరిపోయారు. 
 
తాజాగా, తను వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న ఓ కార్యక్రమం గురించి, అందులో తన వస్త్రధారణ గురించి అభ్యంతరకరంగా ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కంటే రష్మి యాంకర్‌గా చేస్తున్న ఓ కార్యక్రమం సమాజానికి కీడుగా మారిందని ఓ నెటిజన్ వ్యాఖ్యానించాడు. అతనికి రష్మి ఘాటు కౌంటర్ ఇచ్చింది. తనను చూడలేకపోతే కళ్లు మూసుకోమని సూచించింది. 
 
'మేము మీ చేతులు, కాళ్లు క‌ట్టేసి టీవీ ముందు కూర్చోపెట్ట‌డం లేదు. మా ప్ర‌ద‌ర్శ‌న మీకు నచ్చకపోతే చూడ‌కుండా క‌ళ్లు మూసుకోండి. లేదంటే ఛాన‌ల్ మార్చుకోండి. ప్రేక్షకుల ఆదరణ వల్లే ఆ కార్యక్రమం హిట్ అయింది. ఆ షోతో సమస్య ఉన్న వాళ్లు చూడకుండా ఉండొచ్చు. లేకపోతే మీరు ఏమైనా సినిమా తీస్తున్నట్టైతే, అందులో నాకు స‌తీ సావిత్రి పాత్ర ఇవ్వండి. అంతేగానీ, నేను ఎంచుకున్న ప‌ని గురించి న‌న్ను ప్ర‌శ్నించొద్దు. నాకు వ‌చ్చిన అవ‌కాశాల్లో ఉత్త‌మ‌మైన వాటిని ఎంచుకుని మీ అంద‌రిలాగే ప‌నిచేస్తున్నా' అంటూ కౌంటర్‌లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments