Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ యువతిపై 143మంది అత్యాచారం కేసులో నాపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తూ రాక్షసానందమా? యాంకర్ ప్రదీప్ ఫైర్

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (18:45 IST)
ఓ యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ పేరు వుందంటూ ఓ సంచలన వార్త ప్రచారం జరుగుతోంది. తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్‌లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీసీఎస్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్‌, బాధితురాలి స్టేట్‌మెంట్‌ ఆధారంగా నిందితులను విచారించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్‌ఐఆర్‌ రెడీ చేశారు. 143మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్‌ఎఫ్‌ఐ లీడర్లు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. 
 
ఈ కేసులో యాంకర్ ప్రదీప్ పేరు వినిపించడం చర్చనీయాంశమైంది. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు సైతం నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సోషల్‌ మీడియా వేదికగా యాంకర్‌ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. 
 
ప్రదీప్ సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుంటుంబాన్ని ఎంతో మానసిక కుంగుబాటకు గురిచేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్తున్నారు. సెన్సెటివ్ వివాదంలో తన పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారని.. అవతలి వ్యక్తులు తన పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారని వాపోయారు.
 
మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తోందని.. సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బాధితురాలికి న్యాయం జరగాలి కానీ నిజాలు తెలియకుండా తనను టార్గెట్ చేస్తున్నారు. ఈ వివాదంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రదీప్ వెల్లడించారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోహన్ బాబు - మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం