వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధం అంటోంది అనసూయ. ఇప్పటికే సినిమాల్లో అవకాశాలతో దూసుకుపోతున్న అనసూయకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. అది కూడా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది అనసూయ. లక్ష్మీప
వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధం అంటోంది అనసూయ. ఇప్పటికే సినిమాల్లో అవకాశాలతో దూసుకుపోతున్న అనసూయకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. అది కూడా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది అనసూయ. లక్ష్మీప్రసన్న బ్యానర్స్ పైన గాయత్రి సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాలో మోహన్ బాబు ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మంచు విష్ణుతో పాటు కొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే హాట్ యాంకర్ అనసూయ మోహన్ బాబు సరసన నటిస్తోంది. మోహన్ బాబు లాంటి అగ్ర హీరో సరసన నటించడం ఎంతో సంతోషంగా ఉందని అనసూయ చెబుతోంది. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పదంటూ ఒక ఫోటోను పంపుతూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది అనసూయ. జర్నలిస్టుగా సినిమాలో నటించడమే కాకుండా మోహన్ బాబుకు జోడీగా కూడా నటిస్తోంది అనసూయ.