Webdunia - Bharat's app for daily news and videos

Install App

జబర్దస్త్ నవ్వుకోవడానికే...లాజిక్స్ కోసం వెతకొద్దు: అనసూయ

జబర్దస్త్ షోలో అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాధలు అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అనాధ పిల్లలపై ఆయన చేసిన కామెంట్స్‌ని అనాధ విద్యార్ధులు సీరియస్‌గా త

Webdunia
ఆదివారం, 26 నవంబరు 2017 (10:12 IST)
జబర్దస్త్ షోలో అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాధలు అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారాయి. అనాధ పిల్లలపై ఆయన చేసిన కామెంట్స్‌ని అనాధ విద్యార్ధులు సీరియస్‌గా తీసుకుని హైపర్ ఆది టీమ్‌పై, యాంకర్ అనసూయపై, జడ్జిలపై కేసు నమోదు చేశారు. హైపర్ ఆది చేసిన కామెంట్స్ విని మనో వేదనకు గురయ్యామని అనాథ ఆశ్రమంలోని విద్యార్థులు అన్నారు. 
 
ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు యాంకర్ అనసూయ, జడ్జిలు పగలబడి నవ్వుతున్నారు. తమపై చేసిన కామెడీతో నవ్వు ఆపుకోలేక వాళ్ళు అలా నవ్వారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆది ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్పాలని.. అనాథ పిల్లలను ప్రభుత్వానికి సొంతమని చెప్పుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
 
అయితే ఈ వ్యవహారంపై జబర్దస్త్ యాంకర్ అనసూయ ఫైర్ అయ్యింది. తెలుగు సినీ పరిశ్రమకు 'బాహుబలి' ఎలాంటిదో, టీవీ ఇండస్ట్రీకి 'జబర్దస్త్' అలాంటిదేనని చెప్పుకొచ్చింది. ఫేస్‌బుక్‌లో అభిమానులతో లైవ్ చాట్ చేసిన అనసూయ.. జీవితంలో వచ్చే అన్ని అంశాలపై తాము షోలో చూపిస్తున్నామని.. నవ్విస్తున్న వాళ్లను ఏడిపించడం ఏమైనా బాగుందా అంటూ ప్రశ్నించింది.
 
సమస్యల గురించి ఆలోచిస్తే క్రియేటివిటీ పోతుందని.. జబర్దస్త్‌ షోలో లాజిక్స్ కోసం చూడకుండా నవ్వుకోవాలని సూచించింది. ఇలాంటి అంశాలను ఇష్యూ చేయడం కంటే పరిష్కరించాల్సిన చాలా సమస్యలను పట్టించుకుంటే మంచిదని సూచించింది. క్రియేటివిటీని చంపేయవద్దని ఫేస్ బుక్ మాధ్యమంగా అనసూయ కోరింది. 
 
స్కిట్ ప్రకారం అలా రాసుకోవాల్సి వచ్చిందని.. అంతేగానీ ఎవరినీ కించపరిచేందుకు కాదని వివరణ ఇచ్చింది. ఇలాంటి విషయాలను పక్కనబెట్టి మాట్లాడుకోవాలంటే, అమ్మాయిలపై రేప్‌లు, విద్య, రహదారులు వంటి పరిష్కారం కానీ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలని అనసూయ సూచించింది. అంతేకానీ వినోదాన్ని పండించే జబర్దస్త్ షోను ఎందుకు హైలైట్ చేస్తున్నారని ప్రశ్నించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒకే ఒక్క విద్యార్థిని... పాఠశాల యేడాది ఖర్చు రూ.12.48 లక్షలు (Video)

శని శింగ్నాపూర్‌లో శని భగవానుడి చుట్టూ పిల్లి ప్రదక్షిణలు (video)

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన : ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

జగన్‌ను జీవితాంతం జైల్లోనే ఉంచాలి : వైకాపా కార్యకర్త పచ్చిబూతులు (Video)

నా పని నేను చేస్తున్నా.. పోలీసులు వాళ్ళ పని చేస్తున్నారు.. ఆర్జేవీ పరారీపై పవన్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments