Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్డ్‌గా ఉంటూనే ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో అనసూయ విమానంలో నటించింది

Webdunia
శనివారం, 20 మే 2023 (17:30 IST)
Anasuya vimanam
న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా అయినా, పుష్ప 2లో దాక్షాయ‌ణిగా అయినా మెప్పించ‌టం ఆమెకే చెల్లింది. ఇప్పుడలాంటి మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌టానికి రెడీ అవుతోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ఆ సినిమాయే ‘విమానం’.
 
ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌న్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన సుమ‌తి పాత్ర చాలా వెరైటీగా ఉంటుంద‌ని రీసెంట్‌గా విడుద‌లైన స‌ద‌రు పాత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఓ వైపు బోల్డ్‌గా ఉంటూనే ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండే పాత్ర ఆమెది. ఆమె పాత్ర‌కు సంబంధించి ‘సుమతి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మే 22న విడుద‌ల చేయ‌బోత‌న్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, రేలా రేలా అనే లిరికల సాంగ్‌తో పాటు సుమ‌తి పాత్ర ఫ‌స్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.
 
మ‌న‌కు జీవితంలో క‌నిపించే వివిధ పాత్ర‌లకు సంబంధించిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ’విమానం’. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana: భార్య తెలియకుండా రుణం తీసుకుందని భర్త ఆత్మహత్య

Allu Arjun Arrested: ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్.. ఇంటర్వెల్ వరకు కూర్చునే వున్నారు.. (video)

Coins: భార్యకు భరణంగా రూ.80వేలను నాణేల రూపంలో తెచ్చాడు.. (video)

iPhone: హుండీలో పడిపోయిన ఐఫోన్... తిరిగివ్వబోమన్న అధికారులు.. ఎక్కడ?

15 ఏళ్ల మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

తర్వాతి కథనం
Show comments