Webdunia - Bharat's app for daily news and videos

Install App

గామా అవార్డ్స్‌లో "బేబి" సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ అందుకున్న ఆనంద్ దేవరకొండ

డీవీ
గురువారం, 7 మార్చి 2024 (19:06 IST)
దుబాయ్‌లో ఘనంగా జరిగిన గామా అవార్డ్స్‌లో బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ దక్కించుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో ఆనంద్ దేవరకొండ. "బేబి" సినిమాలో ఆయన హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్‌కు గామా అవార్డ్ సొంతమైంది. ఆనంద్‌కు ఇదే ఫస్ట్ బిగ్ అవార్డ్. నటుడిగా ఆనంద్ ప్రతిభకు దక్కబోయే అవార్డ్స్‌కు ఇదే ఫస్ట్ స్టెప్‌గా భావించవచ్చు. దొరసాని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ ఫస్ట్ సినిమాతోనే ఒక మంచి ప్రయత్నం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు.

మిడిల్ క్లాస్ మెలొడీస్, పుష్పక విమానం వంటి సినిమాలతో కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు. సినిమా రిజల్ట్‌తో పనిలేకుండా రొటీన్, రెగ్యులర్ ఫార్మేట్ కమర్షియల్ సినిమాలకు భిన్నమైన మూవీస్ చేస్తూ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
 
గతేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన బేబి సినిమా ఆనంద్ దేవరకొండకు బిగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. ఈ సినిమాలో భగ్న ప్రేమికుడిగా ఆనంద్ నటన ప్రేక్షకుల మనసులను తాకింది. గామా అవార్డ్స్‌లో బేబి సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అవార్డ్ దక్కడం ఆనంద్ పడిన కష్టానికి, ఆయన నట ప్రతిభకు దక్కిన బహుమతి అనుకోవచ్చు. ఈ అవార్డ్ ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని మంచి సినిమాల్లో ఆనంద్ నటించబోతున్నాడు. ప్రస్తుతం ఆయన గం గం గణేశా, డ్యూయెట్ సినిమాలతో పాటు బేబి టీమ్ కాంబినేషన్ మూవీలో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments