Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో 'అమ్మాయిలంతే... అదో టైపు...'

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (16:01 IST)
గోపి రంగా, మాళ‌విక మీన‌న్‌, శివాజీ రాజా ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా గాయ‌త్రి రీల్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం 'అమ్మాయిలంతే.. అదోటైపు'. కృష్ణం ద‌ర్శ‌క‌త్వంలో వై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్.కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటోంది. 
 
ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత వై.వి.ఎస్‌.ఎస్‌.ఆర్‌.కృష్ణంరాజు మాట్లాడుతూ "అమ్మాయిలంతే.. ఆదో టైపు" చిత్రం మంచి ప్రేమ క‌థా చిత్ర‌మే కాదు, ఒక ఊరిలో బాగా డబ్బున్న కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి, ఒక ఆటో డ్రైవర్‌ని ప్రేమించి, తన తండ్రి గౌరవం కంటే తన ప్రేమే ముఖ్యమనుకొని తండ్రికి తెలియకుండా అతన్ని తీసుకొని హైదరాబాద్‌కి వెళ్తుంది. 
 
అది తెలుసుకొని కుంగిపోయిన తండ్రి, తన కూతురు కోసం పడిన తపన, తన తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్ల, తండ్రి ప్రేమకి దూరమయ్యాననే కూతురు పడే బాధ, ఆ తర్వాత జరిగే పర్యావసానాల మధ్య సాగే ఎమోష‌నల్ క‌థ‌. ద‌ర్శ‌కుడు కృష్ణ‌మ్ సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. న‌టీనటులు, టెక్నీషియ‌న్స్ మద్దతుతో సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేయ‌గ‌లిగాం. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జ‌న‌వ‌రిలో ఆడియో విడుద‌ల చేసి, త్వ‌ర‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments