Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఆస్తులను కుమారుడు - కుమార్తెకు సమానంగా పంచాలి : అమితాబ్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను చనిపోతే తన ఆస్తులను ఏ విధంగా పంచాలన్నదే ఆ పోస్ట్ సారాంశం.

Webdunia
గురువారం, 2 మార్చి 2017 (10:41 IST)
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అది ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాను చనిపోతే తన ఆస్తులను ఏ విధంగా పంచాలన్నదే ఆ పోస్ట్ సారాంశం. 
 
తన స్వదస్తూరితో, తన మరణానంతరం ఆస్తుల పంపకం వివరాలు రాసిన ప్లకార్డును అమితాబ్ ప్రదర్శించారు. "నేను మరణిస్తే, నేను వదిలి వెళ్లే అన్ని ఆస్తులను నా కుమారుడు, నా కుమార్తెకు సమానంగా పంచాలి. స్త్రీ, పురుషులు సమానమే. మనమంతా ఒకటే" అని ఆ ప్లకార్డులో ప్రకటించారు.
 
కాగా దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా గతంలో తన ఆస్తులపై ఓ ప్రకటన చేసిన విషయం తెల్సిందే. తాను చనిపోతే తన ఆస్తులను జాతికి అంకితం చేయాలంటూ పేర్కొన్నారు. అమితాబ్‌కు అభిషేక్ బచ్చన్, శ్వేతా నంద అనే కుమారుడు, కుమార్తె ఉండగా, రజినీకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నల్ సోఫియా ఖురేషీ ఉగ్రవాదుల మతానికి చెందినవారా? ఎంపీ మంత్రి కామెంట్స్

AP Cabinet: మే 20న అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం

హనీట్రాప్ వివాదంలో పాక్ దౌత్యవేత్త... అమ్మాయితో అశ్లీల వీడియో

ఉచిత విమానం వద్దనడానికి నేనేమైనా మూర్ఖుడునా? : డోనాల్డ్ ట్రంప్

ఐదేళ్ల బాలిక కారులోనే ప్రాణాలు కోల్పోయింది.. బొమ్మలు కొనివ్వలేదని..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments