Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకీచాన్‌ నిర్మించిన హాలీవుడ్ చిత్రం 'అమెజాన్‌ యోధులు'.. దీపావళికి రిలీజ్

ప్రముఖ హాలీవుడ్‌ నటులు రిచాజెన్‌, సెసిలియా చియాంగ్‌ జంటగా ఇండో ఓవర్సీస్‌ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్‌ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌లో జాకీచాన్‌ నిర్మించిన చి

Webdunia
సోమవారం, 24 అక్టోబరు 2016 (17:28 IST)
ప్రముఖ హాలీవుడ్‌ నటులు రిచాజెన్‌, సెసిలియా చియాంగ్‌ జంటగా ఇండో ఓవర్సీస్‌ బ్యానర్‌పై ఫ్రాంకీఛాన్‌ దర్శకత్వంలో రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌లో జాకీచాన్‌ నిర్మించిన చిత్రం 'ది లెజండరీ అమెజాన్స్‌'. ఈ చిత్రం హాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసి భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని సాయి శ్రీజ విఘ్నేష్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై జి.వంశీకృష్ణ వర్మ 'అమెజాన్‌ యోధులు' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 'మాహిష్మతి రాజ్యం' ఉపశీర్షిక. దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న ఈ చిత్రం రిలీజవుతోంది. 
 
ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణ వర్మ మాట్లాడుతూ ''ప్రముఖ హాలీవుడ్‌ నటుడు జాకీచాన్‌ రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. హాలీవుడ్‌లో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఈ చిత్రం ఉంటుంది. 'బాహుబలి' చిత్రం తరహాలో ఈ చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు భారీగా ఉంటాయి. యాక్షన్‌ సీన్స్‌ అన్నీ చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఇంతకుముందెన్నడూ చూడని విధంగా సన్నివేశాలుంటాయి. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్‌ అయ్యి నిర్మాతగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. మా డిస్ట్రిబ్యూటర్స్‌ అందరూ ఎంతో నమ్మకంతో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు అని చెప్పారు.
 
ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ... ''బాహుబలి'లాంటి చిత్రమిది. ప్రేక్షకులకు నచ్చేవిధంగా యాక్షన్‌ సీన్స్‌, యుద్ధ సన్నివేశాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ప్రతి విజువల్‌ చాలా గ్రాండియర్‌గా ఉంటుంది. దీపావళి పండగకి ఇంతటి భారీ బడ్జెట్‌ చిత్రాన్ని రిలీజ్‌ చేయడం మాకెంతో ఆనందంగా వుంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకం వుంది'' అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: జి. యుగంధర్‌రెడ్డి, నిర్మాత: జి.వంశీకృష్ణ వర్మ, దర్శకత్వం: ఫ్రాంకీ ఛాన్‌. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments