Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప కోసం కోట్ల ఖర్చు... రూ.40-50 కోట్ల వరకు బడ్జెట్టా?

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (18:38 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా భారీ హిట్ అయ్యింది. రెండేళ్ల కిందటే వచ్చిన పుష్ప: ది రైజ్ పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో భాగం మొదలైనప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి.  
 
ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఖర్చు మాములుగా లేదని సమాచారం. చిన్న చిన్న సన్నివేశాల చిత్రీకరణకు భారీ సమయం పడుతోంది. భారీ సెట్టింగులు, వందల వేల మందితో షూటింగ్ చేస్తున్నారు. 
 
ముందుగా వారందరితో రిహార్సల్స్ చేయిస్తారు. ఆ తర్వాత షూటింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా గంగా జాతర సీక్వెన్స్‌ని ఓ రేంజ్ లో షూట్ చేస్తున్నారు. రూ.40-50 కోట్ల వరకు ఖర్చవుతుందని సమాచారం. 
 
షూట్ స్టార్ట్ అయ్యే సమయానికి రూ.200 కోట్లతో సినిమా చేయాలనేది ప్లాన్. కానీ ఇప్పటికే అంచనా బడ్జెట్ 50 శాతం పెరిగింది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న పుష్ప 2 చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments