క్రిస్మస్‌కి "పుష్ప" పార్ట్ 1: బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ ఖుషీ

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (15:09 IST)
Pushpa
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా పుష్ప రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమాగా పుష్ప మీద భారీ అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న పుష్ప సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
 
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ పార్ట్ -1 ను ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ 25వ తారుఖున అన్నీ థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కాసేపటి క్రితమే చిత్ర బృందం ట్విటర్ వేదికగా వెల్లడించింది. ఈ క్రిస్మస్ మరింత ఐకానిక్ గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. కాగా ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments