Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల వైకుంఠపురంలో కొత్త రికార్డ్.. టీఆర్పీ రేటింగ్ అదిరిపోయిందిగా..!

Allu Arjun
Webdunia
గురువారం, 27 ఆగస్టు 2020 (12:50 IST)
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం అల వైకుంఠపురంలో. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా,  సుశాంత్‌, టబు ప్రధాన పాత్రల కనిపించారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందించారు. నాన్ బాహుబలి చిత్రంగా అనేక రికార్డులు క్రియేట్ చేసిన అల వైకుంఠపురములో చిత్రం గత వారం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం చేయబడింది. 
 
ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో 29.4 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. తెలుగు చిత్రాలలో ఇప్పటివరకు ఇదే అత్యధికం అంటున్నారు. లాక్‌డౌన్ వలన ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఈ సినిమాని చాలామంది వీక్షించినట్టు తెలుస్తుంది. కాగా, సినిమాలోని ప్రతి సాంగ్ కూడా దేశ వ్యాప్తంగానే కాక విదేశీ ప్రేక్షకులని కూడా ఎంతగానో ఆకట్టుకుంది.
 
ఇదిలా ఉంటే.. అల వైకుంఠపురములో అంటూ సంక్రాంతికి ప్రేక్షకులకు ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డుల పంట పండిస్తోంది. నిత్యం ఏదో ఒక విషయంలో రికార్డులు సెట్ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ సినిమా మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. తాజాగా అల వైకుంఠపురములో చిత్ర ఆల్బమ్ వంద కోట్ల వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments