Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

సెల్వి
ఆదివారం, 24 నవంబరు 2024 (09:16 IST)
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పుష్ప-2 డిసెంబర్ 5న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా నుండి స్పెషల్ ఐటెం సాంగ్ అయిన ‘కిసిక్’ను నవంబర్ 24న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. చెన్నైలో జరిగే ఈవెంట్‌లో ఈ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.
 
ప్రస్తుతం నిర్మాణానంతర పనులతో పాటు చివరి పాట చిత్రీకరణ జరుపుకుంటోన్న ఈ చిత్రం డిసెంబరు 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మూడేళ్ల క్రితం ఇదే కాంబినేషన్‌లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకున్న 'పుష్ప' ది రైజ్‌ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే.   
 
ఇక వసూళ్ల పరంగా పుష్ప-2 ముందస్తుగానే రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ముఖ్యంగా యూఎస్‌ఏలో బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ విషయంలో 'పుష్ప-2'  వసూళ్ల వేట మొదలైంది. సినిమా విడుదలకు పన్నెండు రోజుల ముందే ఈ చిత్రం ప్రీసేల్స్‌లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. 
 
ఇప్పటి వరకు యూఎస్‌ఏలో 45 వేల టిక్కెట్స్‌ పైగా సేల్స్‌ సాధించి 1.25 మిలియన్‌ డాలర్స్ మార్క్‌ కలెక్షన్‌ను టచ్‌ చేసింది. ఇది ఇండియన్‌ సినిమా నుంచి ఆల్‌టైమ్‌ ఫాస్టెస్ట్‌ వసూళ్లుగా యూఎస్ ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వితంతు పింఛను ఆశ చూపి.. మహిళపై అత్యాచారం... కాకాణి అనుచరుడి అరెస్టు!!

హుండీలో జారిపడిన భక్తుడి ఐఫోన్‌ దేవుడికే చెందుతుందా, తిరిగి తీసుకోలేరా?

మూస ధోరణి కి తిరస్కారం, పురాణ కల్పితాలకు పెద్దపీఠ - 2024 సినీరంగం రౌండప్

సంధ్య థియేటర్ తొక్కిసలాట : సీన్ రీకన్‌స్ట్రక్షన్ యోచనలో పోలీసులు...

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసు : వెలుగులోకి నమ్మలేని నిజాలు ఎన్నెన్నో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

పాలు తాగితే 8 ప్రయోజనాలు, ఏమిటి?

శీతాకాలంలో తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటి?

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

తర్వాతి కథనం
Show comments