టర్కీ టూర్‌లో అల్లు అర్జున్ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్
సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ''సరైనోడు'' చిత్రంతో మాంచి ఊపుమీదున్న అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి టర్కీ టూర్‌కి వెళ్లారు. భార్య
సినిమాలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ''సరైనోడు'' చిత్రంతో మాంచి ఊపుమీదున్న అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి టర్కీ టూర్‌కి వెళ్లారు. భార్యతో కలిసి టర్కీలోని టూరిస్ట్ ప్లేసెస్‌ను విజిట్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అట్లాంటా సిటీ సమీపంలోని కుర్సునులు వాటర్ ఫాల్ పార్క్‌లో తన భార్యతో కలిసి చక్కర్లు కొడుతున్న ఫోటోలు ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు.
టర్కీ ఇస్తాంబుల్‌లోని ప్రముఖ మసీద్ సుల్తాన్ అహ్మద్ కమీని సందర్శించినట్టు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ఇంతవరకూ ఇలాంటి అందాన్నిఎప్పుడూ చూడలేదన్నారు. ఈ సందర్భంగా సుల్తాన్ కాలం నాటి డ్రెస్‌లు ధరించిన బన్నీ దంపతులు వాటిని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ సుల్తాన్, సుల్తానీ అని కామెంట్ కూడా పెట్టారు. టర్కీలో వారం రోజులకు పైగా ఉండనున్న బన్నీ ఫ్యామిలీ.. అక్కడ ప్రఖ్యాతి చెందిన అన్ని ప్రదేశాలను కవర్ చేయనున్నారు.